ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఆర్మీపై బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత తప్పును తెలుసుకొని క్షమాపణ కోరారు. 

Last Updated : Jan 2, 2018, 07:12 PM IST
ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఆర్మీపై బీజేపీ ఎంపీ నేపాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత తప్పును తెలుసుకొని క్షమాపణ కోరారు.  రాంపూర్ నుండి ఎన్నికైన బీజేపీ పార్లమెంటరీ సభ్యుడు నేపాల్ సింగ్, సైనికులకు చనిపోవాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు, ఈ వివాదం తెరమీదికొచ్చింది.

"సైన్యాన్ని అగౌరవపరచాలన్నది నా ఉద్దేశం కాదు. నేను ఈ మాటలకు చాలా బాధపడ్డాను. అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. కానీ నేను అలాంటిది ఏమీ చెప్పలేదు. జవాన్లను రక్షించేందుకు ఏదైనా ఒక పరికరాన్ని కనుగొనటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తే బాగుంటుందని నేను చెప్పాను"  అన్నారు. 

ఇదివరకు.. సీఆర్పీఎఫ్ శిబిరం వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఘటన గురించి.. తాజాగా చనిపోయిన భారతీయుల సైనికుల మరణాల గురించి, బీజేపీ ఎంపీ మాట్లాడుతూ, "సైన్యంలో ఉన్నవారు ప్రతిరోజూ చనిపోతారు. పోరాటంలో సైనికులు చనిపోకుండా ఉన్న దేశం ఏదైనా ఉందా? గ్రామాల్లో కొట్లాటలు జరిగినప్పుడు కూడా ఒక్కరన్న గాయపడకుండా ఉంటారా? మనిషి చనిపోకుండా ఉండటానికి ఏదైనా పరికరం ఉంటే చెప్పండి? బుల్లెట్‌లను ఆపే ఏదైనా ఒక వస్తువును ఉంటే చూపించండి" అన్నారు.

Trending News