Banks Strike: మీ బ్యాంకు పనులు వచ్చేవారానికి వాయిదా వేసుకున్నారా..లేదా వచ్చేవారం మీకు బ్యాంకులున్నాయా. అయితే ప్రీ పోన్ చేసుకోండి. లేదా వాయిదా వేసుకోండి. ఎందుకంటే వచ్చేవారం కేవలం రెండ్రోజులే బ్యాంకులు పనిచేయనున్నాయి.
దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మె(Banks strike)కు పిలుపిచ్చాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ( Banks privatisation)ను వ్యతిరేకిస్తూ 9 ప్రధాన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు అఖిల భారత సమ్మె తలపెట్టాయి. మార్చ్ 15,16 తేదీల్లో బ్యాంకుల సమ్మె జరగనుంది. దాంతో ఆ రెండ్రోజులకు బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపింది. అంతే కాకుండా వివిధ కారణాలతో వచ్చేవారం ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలు ఆగనున్నాయి. మార్చ్ 11 శివరాత్రి పురస్కరించుకు బ్యాంకులకు సెలవుంది. మార్చ్ 13న రెండవ శనివారం, మార్చ్ 14న ఆదివారం కారణంగా సెలవుంది. అంటే ఈ లెక్కన మార్చ్ 12, 17 తేదీల్లో మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.
అందుకే వచ్చేవారం బ్యాంకు పనులేమైనా ఉంటే ఇప్పుడే ప్రీ పోన్ చేసుకోండి లేదా పోస్ట్‌పోన్ చేసుకోండి. కేంద్ర ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitaraman)బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీలను ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మె ప్రకటించాయి.
Also read: Tirath Singh Rawat: Uttarakhand నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్, సాయంత్రం ప్రమాణ స్వీకారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook