ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పనివేళలు, జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి వివరాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఉద్యోగుల టేక్ హామ్ శాలరీ తగ్గనుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) మరియు గ్రాట్యుటీ పెరిగినా, టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా తగ్గుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.
7th Pay Commission: ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పనివేళలు, జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి వివరాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఉద్యోగుల టేక్ హామ్ శాలరీ తగ్గనుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) మరియు గ్రాట్యుటీ పెరిగినా, టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా తగ్గుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పనివేళలు, జీతం, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటి వివరాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఉద్యోగుల టేక్ హామ్ శాలరీ తగ్గనుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) మరియు గ్రాట్యుటీ పెరిగినా, టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా తగ్గుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. Also Read: Night Duty Allowance: నైట్ డ్యూటీ అలవెన్స్ కేటాయింపులపై కేంద్రం కీలక నిర్ణయం
వేతన సవరణ బిల్లులో పేర్కొన్న దాని ప్రకారం.. ఉద్యోగికి ఆఫీసు యాజమాన్యం అందించే అలవెన్సులు వేతనంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించరాదు. కానీ పన్నుల నుంచి మినహాయింపుల కోసం పలు కంపెనీలు ఉద్యోగులకు అలవెన్స్ రూపంలో జీతంలో కొంత మొత్తాన్ని అందిస్తుంటాయి. కనుక ఇకనుంచీ అలాంటి ఉద్యోగులకు ఇంటికి తీసుకెళ్లే జీతం తగ్గనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మొత్తం జీతంలో బేసిక్ శాలరీ 50 శాతం లేదా అంతకుమించి ఉన్న ఉద్యోగులకు ఏ సమస్య ఉండదు. ప్రావిడెంట్ ఫండ్ అనేది బేసిక్ శాలరీకి సంబంధించిన అంశం కనుక అలాంటి ఉద్యోగుల వేతనాలలో అంతగా మార్పులు ఉండకపోవచ్చు.
బేసిక్ శాలరీ కన్నా అలవెన్సులు, ఇతర రకాల ప్రయోజనాలను జీతంగా పొందనున్న ఉద్యోగుల పాలిట నూతన వేతన సవరణ బిల్లు శాపంగా మారనుంది. వేతన సవరణ బిల్లు లేదా వేతన చట్టం 2019 పార్లమెంట్లో రెండేళ్ల కిందట ఆమోదం పొందింది. 1 ఏప్రిల్, 2021 నుంచి ఆ ప్రతిపాదనలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, కార్మిక శాఖ యోచిస్తున్నాయి. తద్వారా ఆయా కంపెనీల హెచ్ఆర్ పాలసీలలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పీఎఫ్, గ్రాట్యూటీ లాంటివి పెంచడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో ఉద్యోగి ఏ ఆందోళన లేకుండా ఉండవచ్చు. Also Read: EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మీ UAN ఇలా యాక్టివేట్ చేసుకోండి
వేతన చట్టంలో మార్పులలో ముఖ్యంగా పనివేళల అంశం కీలకంగా మారనుంది. గతంలో ఎవరైనా ఉద్యోగి 30 అధికంగా పనిచేస్తేనే అది ఓవర్ టైమ్‌గా పరిగణించేవారు. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఓఎస్సీహెచ్ కోడ్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం, ఉద్యోగి అదనంగా 15 నుంచి 30 నిమిషాలు పని చేస్తే అది ఓవర్ టైమ్ కింద పరిగణించాలి.
ఉద్యోగికి గరిష్ట పనివేళలు 12కు పెంచుతున్నారు. విరామం లేకుండా 5 గంటలు పనిచేస్తే ఆ ఉద్యోగికి కచ్చితంగా అరగంట విరామం ఇవ్వాల్సి వస్తుంది. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి జీతం అందుకోవడానికి కొన్ని రోజులు ఉన్నందున కేంద్రం ఈ పనిపై ఫోకస్ చేస్తోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook