Vaccine for Children: కోవిడ్ ఉధృతి నేపధ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అవసరం

Vaccine for Children: దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. అటు ఆక్సిజన్ కొరత ఇటు బెడ్స్ కొరతకు తోడు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2021, 04:54 PM IST
Vaccine for Children: కోవిడ్ ఉధృతి నేపధ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అవసరం

Vaccine for Children: దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. అటు ఆక్సిజన్ కొరత ఇటు బెడ్స్ కొరతకు తోడు ఇప్పుడు వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా స్పందన లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతికి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. మూడ్రోజుల్నించి రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కేసులు పెరగడంతో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ అందక (Oxygen Shortage) ప్రాణాలు పోతున్నాయి. 

ఇది చాలదన్నట్టు థర్డ్‌వేవ్ గురించి ప్రజలు భయాందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతానికి ప్రతి నెలా 80-85 లక్షల వ్యాక్సిన్లు కావాలని తెలిపారు. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ పెట్టినా ఆ కంపెనీల నుంచి స్పందన లేదని కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. దాదాపుగా 3 వందల పాఠశాలల్ని వ్యాక్సినేషన్ కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు. కరోనా సంక్రమణ నేపధ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందుబాటులో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకు మూడు కోట్ల వ్యాక్సిన్ ( Vaccine) అవసరముందన్నారు. అది సమకూరితే 3 నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ఢిల్లీ(Delhi) లో రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్టు వివరించారు. 
Also read: INS Vikramaditya: ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో మంటలు, సిబ్బంది సురక్షితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News