Mixing of Vaccines: వ్యాక్సిన్ విషయంలో మరో సరికొత్త ప్రయోగం జరుగుతోంది. రెండు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొనేందుకు ఇదొక ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది.
కరోనా ఉధృతి (Corona Pandemic) కొనసాగుతున్న వేళ వ్యాక్సిన్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారింది. అగ్రరాజ్యాలు కావల్సినంత సమకూర్చుకున్నప్పటికీ మధ్య ఆదాయ దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) విజృంభిస్తున్న తరుణంలో ఇండియాలో ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. ఈ తరుణంలో వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొనేందుకు సరికత్త ప్రయోగం జరుగుతోంది. రెండు విభిన్న కంపెనీలు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (Oxford university) పరిశోధకులు ది లాన్సెట్ జర్నల్‌లో వివరాలు సమర్పించారు. ఆస్ట్రాజెనెకా ( AstraZeneca) పీఎల్సి మొదటి డోసు తీసుకున్నవారికి రెండవ డోస్‌గా ఫైజర్ (Pfizer vaccine) ఇంక్ వ్యాక్సిన్ ఇచ్చారు. నాలుగు వారాల అనంతరం స్వల్పకాలిక దుష్ఫ్రభావాలు కన్పించాయని తేలింది.
ఫ్రాన్స్‌లో వృద్ధరోగులకు తొలి డోసుగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్( Astrazeneca vaccine) ఇవ్వగా..రెండవ డోస్‌గా ఫైజర్ వ్యాక్సిన్ అందించారు. ఇది ఓ చమత్కారమైన అన్వేషణ అని..మెరుగైన రోగ నిరోధక ప్రతిస్పందన కల్గిస్తుందో లేదో తెలియదని..కొన్ని రోజుల్లో ఆ ఫలితాల్ని కనుగొంటామని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ అధ్యయనంపై ఎటువంటి భద్రతా ప్రమాణాల్ని సూచించలేదు. కొన్ని రోజుల తరువాత బలమైన దుష్ర్పరిణామాలు కూడా మాయమయ్యాయని పరిశోధకులు తెలిపారు. రెండు వ్యాక్సిన్ల మధ్య 12 వారాల విరామాన్ని కూడా పరిశోధకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి పరిశోధన దశలో ఉన్న ఈ ప్రయోగాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉంది. ఈ తరహా ప్రయోగాల్ని విస్తృత స్థాయిలో చేసిన తరువాతే నిర్ణయానికి రావల్సి ఉంటుంది.
Also read: Ivermectin Medicine: ఐవర్‌మెక్టీన్ డ్రగ్ వినియోగంపై భిన్నాభిప్రాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook