Gold Rate Update 04 June 2021: కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పెరిగింది. దేశ రాజధానిలో మాత్రం వరుసగా ఏడోరోజు పసిడి ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధర భారీగా పతనమైంది. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. తాజాగా రూ.100 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,400కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,200 వద్ద మార్కెట్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు గత వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కరోనా కేసులు తగ్గడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రూ.110 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,360కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,110 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
వెండి ధర ఢిల్లీలో భారీగా పతనమైంది. రూ.1,200 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి ధర రూ.70,800కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా క్షీణించింది. విజయవాడ, హైదరాబాద్లో రూ.900 మేర వెండి ధర తగ్గడంతో నేడు 1 కేజీ ధర రూ.76,600 వద్ద మార్కెట్ అవుతోంది.