Heroin seized: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన Drugs పట్టివేత

DRI seizes Heroin worth of Rs 21 cr at Hyderabad airport: హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఉదయం రూ. 21 కోట్లు విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఆ హెరాయిన్ డ్రగ్స్ (Heroin drugs) హైదరాబాద్ తీసుకొచ్చారు ? ఎవరు ఇచ్చి పంపించారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2021, 08:11 PM IST
Heroin seized: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన Drugs పట్టివేత

DRI seizes Heroin worth of Rs 21 cr at Hyderabad airport: హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం ఉదయం రూ. 21 కోట్లు విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాంబియా నుంచి వస్తున్న జాంబియ జాతీయురాలు హైదరాబాద్‌కి డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు స్పష్టమైన సమాచారం అందుకున్న డిఆర్ఐ అధికారులు.. ఆమె లగేజీని తనిఖీ చేయగా అందులో 3.2 కిలోల తెల్లని పౌడర్ లభ్యమైంది. ఆ పొడిని ల్యాబ్‌లో పరీక్షించగా.. ఊహించినట్టుగానే అది హెరాయిన్ అని తేలింది. 

పట్టుబడిన హెరాయిన్ విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌తో (Drugs) పట్టుబడిన మహిళ జాంబియా నుంచి జొహన్నెస్‌బర్గ్, దోహా మీదుగా హైదరాబాద్ వచ్చినట్టు అధికారుల విచారణలో తేలింది. ఎవరి ఆదేశాల మేరకు ఆ హెరాయిన్ డ్రగ్స్ (Heroin drugs) హైదరాబాద్ తీసుకొచ్చారు ? ఎవరు ఇచ్చి పంపించారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

Trending News