Delta virus transmits through air: హైదరాబాద్: డెల్టా వైరస్ వేరియంట్ గాలి ద్వారా సోకుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గలేదన్న ఆయన.. డెల్టా వెరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు జనం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని (Wearing mask) సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 7 జిల్లాలు 11 ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయడం జరిగిందని శ్రీనివాస రావు వెల్లడించారు.
రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాలు పెరిగిన నేపథ్యంలో జనం గుంపులు గుంపులుగా తిరగకుండా చూసుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులు ఎవ్వరూ కరోనావైరస్ మార్గదర్శకాలు (COVID rules) పాటించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు.
Also read : Schools Reopen: స్కూళ్లు, కళాశాలల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
దాదాపు మరో రెండేళ్లు పాటు మానవాళి కరోనా వైరస్‌తో (Coronavirus) పోరాడాల్సి ఉంటుందని చెప్పిన శ్రీనివాస రావు.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నివారణ కోసం ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా నిత్యం లక్ష వరకు కరోనా టెస్టులు చేస్తున్నాం అని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ (Corona third wave) వచ్చేస్తోందన్న హెచ్చరికల నేపథ్యంలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు కూడా హెచ్చరికలుగానే భావించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read : Covid19 Vaccines: దేశంలో త్వరలో అందుబాటులో రానున్న నాలుగు వ్యాక్సిన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook