Jio New Reachrge Plans: జియో కొత్త ప్లాన్స్‌..ఫ్రీ డేటా, కాలింగ్ తో పాటు ఉచితంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్!

ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను తీసుకొస్తూ.. జియో టెలికాం రంగంలో దూసుకేల్తుంది. కొత్తగా విడుదల చేసిన ఐదు ప్లాన్ లు మరియు వాటి వివరాలు పూర్తిగా తెలుపబడ్డాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2021, 03:42 PM IST
  • కొత్త ప్లాన్ లను తీసుకొచ్చిన రిలయన్స్ జియో
  • డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్
  • లీకైన ఆండ్రాయిడ్ జియో ఫోన్ ధర
  • ప్రపంచంలో అతి చవకైన ఆండ్రాయిడ్ ఫోన్ గా గుర్తింపు
Jio New Reachrge Plans: జియో కొత్త ప్లాన్స్‌..ఫ్రీ డేటా, కాలింగ్ తో పాటు ఉచితంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్!

Jio New Prepaid Plans: టెలికాం రంగంలో సంచలనం శృష్టించిన జియో (Reliance jio) ఎప్పటికపుడు కొత్త ప్లాన్ ను తీసుకొస్తూ, యూసర్లను ఆకట్టుకుంటుంది. కొత్తగా 5 ప్లాన్ ను అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లలో అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 మెసేజ్ లతో పాటు సంవత్సరం పాటు ఉచితంగా  "డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్" (disney Plus hotstar) ను ఒక సంవత్సరం పాటు అందించంనుంది.  
ముఖ్యంగా ఈ నెలలో ప్రారంభం కానున్న IPL (Indian Premier League)ను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్లాన్ లకు ఉచిత డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (Disney Plus hotstar subscription) అందించినుంది. జియో ప్లాన్స్ మరియు వారి వివరాలు ఇలా ఉన్నాయి....

రూ.499 ప్లాన్‌తో రీచార్జ్‌ 
రిలయన్స్ ప్రవేశపెట్టిన రూ.499 ప్లాన్‌ తో రీచార్జ్ చేసుకుంటే, 28 రోజుల వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (Unlimited Voice calling), రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 3 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్  (Disney Plus hotstar subscription) పొందవచ్చు. 

Also Read: India Covid: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు...ఒక్క కేరళలోనే 30వేలకుపైగా ..

రూ.666 ప్లాన్‌తో రీచార్జ్
తరువాత రీచార్జ్ ప్లాన్ విషయానికి వస్తే రూ.666 ప్లాన్‌తో రీచార్జ్ చేయిస్తే 56 రోజుల ప్లాన్ వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 2 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 

రూ.888 ప్లాన్‌తో రీచార్జ్
ఇక రూ.888  రీచార్జ్ తో 84 రోజుల ప్లాన్ వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (Unlimited Voice calling), రోజుకు 100  ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 2 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 

రూ.2,599 ప్లాన్‌తో రీచార్జ్
రూ.2,599 ప్లాన్‌ విషయానికి వస్తే ఇది సవత్సరం పాటు అందించే ప్లాన్. ఈ ప్లాన్ లో 365 రోజుల ప్లాన్ వాలిడిటితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (Unlimited Voice calling), రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ తో పాటు రోజుకి 2 జీబీల డేటా లభించనుంది. వీటితో పాటుగా ఉచితంగా ఒక సంవత్సరం డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 

Also Read: Gas Price Hike: మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు, సిలెండర్‌కు 25 రూపాయలు పెంపు

రూ.549 యాడ్-ఆన్ ప్లాన్
పైన పేర్కొన్న ప్లాన్ లతో పాటు జియో కొత్త యాడ్-ఆన్ ప్లాన్ (Jio Add on pack) అందుబాటులో తీసుకొచ్చింది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు ఉండగా..  రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. కానీ దీనిలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100  ఎస్ఎంఎస్ బెనిఫిట్స్‌ లభించటం లేదు. కానీ ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే మాత్రం మీకు ఒక సవత్సరం పాటు నేషనల్ జియోగ్రఫిక్ (National Geographic Channel), హెచ్‌బీవో (HBO), ఎఫ్ఎక్స్ (FX), డిస్నీ (disney ), మార్వెల్ (Marvel), స్టార్‌వార్స్ (Star war) మరియు వెబ్ సీరిస్ లను ఉచితంగా చూడవచ్చు. అంతేకాకుండా పైన పేర్కొన్న షోలన్ని ఇంగ్లీషులో చూడవచ్చు 

ఈ కొత్త ప్లాన్ లు ఇలా ఉంటే.. ప్రపంచంలో అతి చవకైన ఆండ్రాయిడ్ జియో ఫోన్ (World cheapest android phone) ను ఆ కంపెనీ విడుదల చేయబోతుందన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఫోన్ విడుదల గురించి కంపెనీ నుండి ఎలాంటి ప్రకటన రాకున్నా.. చాలా మంది ఈ ఫోన్ గురించి ఎదురుస్తున్నారు. గూగుల్ (Google) మరియు జియో (Reliance jio) సంస్థ కలిసి ఈ ఫోన్ ను తయారు చేస్తుంది. 

Also Read: Jabardasth Avinash Engagement: ఎంగేజ్మెంట్‌తో సడెన్ షాకిచ్చిన ముక్కు అవినాష్.. అమ్మాయి ఎవరో తెలుసా?

గతంలో జియో ఫోన్ ఆన్ లైన్ లో లీకైన వివరాల ప్రకారం , దీని ధర  రూ.3,499గా ఉండనుంది. 5.5 అంగుళాల డిస్ప్లే గల ఈ ఫోన్ లో మూడు వైపు  8 మెగాపిక్సెల్ కెమెరా, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు  2500 ఎంఏహెచ్‌గా బ్యాటరీ ఉండనుందని సమాచారం. అంతేకాకుండా బ్లూటూత్ జీపీఎస్,  వీడియో రికార్డింగ్ ఎల్పీడీడీఆర్3 ర్యామ్ తో పాటు స్టోరేజ్ వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News