Breaking News: అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

Pornography Case: అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు రూ .50 వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 08:30 PM IST
  • ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్‌ కుంద్రాకు ఊరట
  • బెయిల్ మంజూరు చేసిన ముంబయి కోర్టు
  • రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు
Breaking News: అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరు

Pornography Case: ఫోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, ప్రముఖ బాలీవుడ్‌ తార శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో అరెస్టయిన దాదాపు రెండు నెలల తర్వాత ఆయనకు బెయిల్‌ వచ్చింది. రూ.50వేల పూచీకత్తుపై ముంబయి కోర్టు(Mumbai Court) ఆయనకు సోమవారం బెయిల్‌ను మంజూరు చేసింది. కుంద్రాతో పాటు ఆయన దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న  ర్యాన్ థోర్పేకి సైతం బెయిల్(Bail) మంజూరు అయ్యింది. 

పోర్నోగ్రఫీ కేసు(Pornography Case)లో జులై 19న రాజ్‌కుంద్రా సహా పలువురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి(Shilp Shetty) పేరునూ పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా.. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. బ్రిటన్ సిటిజన్ గా ఉన్న రాజ్ కుంద్రా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ పోలీసులు భావించగా.. ఇప్పటికే ఎన్నోసార్లు కుంద్రా బెయిల్ నిరాకరించబడింది. ఈ క్రమంలోనే కుంద్రా పాస్ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Also Read:Bheemla Nayak Blitz: భీమ్లా నాయక్.. డానియల్ శేఖర్‌ వచ్చేశాడు.. నేనెవరో తెలుసా? హీరో అంటూ పవర్​ఫుల్ డైలాగ్‌తో అదరగొట్టిన రానా

వివరాల్లోకి వెళితే..

యాప్ యూజర్లు మూడు రెట్లు పెంచుకోవడమే లక్ష్యంగా రాజ్ కుంద్రా ప్లాన్ చేశాడని, రెండేండ్లలో 8రెట్ల లాభం పొందాలని భావించాడని, 119 అశ్లీల చిత్రాలను నిర్మించి, రూ.8.84 కోట్లకు అమ్మాలని అనుకున్నట్లు చార్జిషీట్‌లో పెట్టారు అధికారులు. రాజ్ కుంద్రా ఫస్ట్ యాప్‌ బ్యాన్ అవ్వగా.. మరో యాప్‌ను రూపొందించాడని, డిజిటల్ మీడియాను ఉపయోగించుకుని అక్రమంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేసినట్లుగా గుర్తించారు.

అశ్లీల చిత్రాల విషయం బయటపడిన తర్వాత డేటాను సీక్రెట్‌గా పెట్టుకునే ప్రయత్నం చేశారని, కుదరకపోవడంతో డిలేట్ చేసి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఈ విషయాలను ముంబై పోలీసులు చార్జిషీట్‌లో వెల్లడించారు. మడ్ ఐల్యాండ్‌లోని ఓ భవంతిపై పోలీసులు దాడులు జరిపిన సందర్భంలో అశ్లీల చిత్రాల నిర్మాణం విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

రాజ్‌ కుంద్రా సంస్థలో పనిచేస్తున్న ఉమేష్‌ కామత్‌ అనే వ్యక్తి అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని లండన్‌లోని రాజ్‌ కుంద్రా బామ్మర్ది ప్రదీప్‌ బక్షికి పంపేవాడని, అక్కడ ఉమేశ్‌ కామత్‌ అశ్లీల చిత్రాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేసేవాడని పోలీసులు చెప్పారు. ఛార్జ్‌షీట్ ప్రకారం, ‘హాట్‌షాట్’ యాప్ ఖాతా, ‘హాట్‌షాట్’ టేక్ డౌన్ అనే రెండు వాట్సాప్ గ్రూపులు ఉమేష్ మొబైల్‌లో గుర్తించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x