Nigeria Digital Currency: క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాల వ్యూహం, సొంతంగా డిజిటల్ కరెన్సీ

Nigeria Digital Currency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. సొంత డిజిటల్ కరెన్సీను ఆందుబాటులో తీసుకురానున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 22, 2021, 09:36 PM IST
  • క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాల సరికొత్త వ్యూహం
  • సొంతంగా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టేందుకుకు సన్నాహాలు చేస్తున్న నైజీరియా, ఘనా దేశాలు
  • అక్టోబర్ 1 నుంచి ఈనైరా పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టనున్న నైజీరియా
Nigeria Digital Currency: క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాల వ్యూహం, సొంతంగా డిజిటల్ కరెన్సీ

Nigeria Digital Currency: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయి. సొంత డిజిటల్ కరెన్సీను ఆందుబాటులో తీసుకురానున్నాయి.

క్రిప్టోకరెన్సీ(Cryptocurrency). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. పలు దేశాలు నిషేధించినా ప్రజలు మాత్రం క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నారు. క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డుల్ని నమోదు చేస్తూ గణనీయంగా వృద్ధి సాధిస్తోంది. ప్రపంచం మొత్తం మీద 6 వేలకు పైగా క్రిప్టోకరెన్సీలు వాడుకలో ఉన్నప్పటికీ..బిట్‌కాయిన్, ఈథిరియం, డాగ్‌కాయిన్ వంటివి ఎక్కువ ఆదరణ పొందాయి. మరోవైపు ఎల్ సాల్వాడార్, పరాగ్వే వంటి దేశాలు క్రిప్టోకరెన్సీకు చట్టబద్ధత కల్పిస్తామంటున్నాయి. 

ఈ క్రమంలో క్రిప్టోకరెన్సీకు పోటీగా ఆఫ్రికన్ దేశాలు(African Countries)సరికొత్త వ్యూహం రచిస్తున్నాయి. సొంత డిజిటల్ కరెన్సీను అందుబాటులో తీసుకురానున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన నైజీరియా, ఘనా దేశాల సెంట్రల్ బ్యాంకులు డిజిటల్ కరెన్సీను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి. నైజీరియా, ఘనా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు విదేశీ కరెన్సీల డిజిటల్ వెర్షన్‌లను రూపొందించేందుకు విదేశీ ఫైనాన్షియల్ టెక్ కంపెనీలతో భాగస్వామ్యమయ్యాయి. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న నైజీరియా, ఘనా దేశాలు కీలకమైన అడుగేశాయి. ఆఫ్రికాలో నైజీరియా(Nigeria) దేశానిది అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది. అక్టోబర్ 1 నుంచి ఈనైరా పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ నెల నుంచి ఈసేడీ పేరుతో డిజిటల్ కరెన్సీ ట్రయల్స్ చేయనున్నట్టు సమాచారం. నైజీరియాలో క్రిప్టోకరెన్సీను అక్కడి ప్రజలు ఎక్కువగా వినియోగించడంతో..నైజీరియన్ కరెన్సీ విలువ పడిపోయింది. ఈ నేపధ్యంలో సొంతంగా డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 

Also read: Newyork: న్యూయార్క్ హోటల్‌లో ఆ దేశాధ్యక్షుడికి నో ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News