Anasuya Fires on Kota: హీరోలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఎందుకు అడగరు..? కోటకు స్ట్రాంగ్ కౌంటర్

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు హాట్ యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే.. దీనికి బదులుగా అనసూయ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది.. అదేంటంటే...!!

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 09:59 AM IST
  • కోటపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన అనసూయ
  • దుస్తువులు ధరించటం అనేది వ్యక్తిగతం అన్న యాంకర్
  • హీరోలను అలా ఎందుకు ప్రశ్నించరు అంటూ ఘాటు సమాధానం
Anasuya Fires on Kota: హీరోలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఎందుకు అడగరు..? కోటకు స్ట్రాంగ్ కౌంటర్

Anasuya Fires on Kota Srinivasarao: హాట్ అండ్ జబర్దస్త్ యాంకర్ అనసూయ.. బుల్లితెర పైనే కాదు సినిమాలో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకూండా, డ్రెస్సింగ్ స్టైల్స్ లో, హాట్ ఫోటో షట్ లతో, అందాల ఆరబోతలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా తన స్టైల్లో రెచ్చిపోతుంది. 

కానీ, ఆమె డ్రెస్సింగ్ స్టైల్స్ పై ఇప్పటికీ చాలా మంది విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి ఆ బట్టలేంటి అంటూ ట్రోల్స్‌ను ఇ‍ప్పటికీ అనసూయ ఎదుర్కొంటుంది. తాజాగా అనసూయ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) వివాదాస్పద కామెంట్స్‌ చేసిన సంగతి మనకు తెలిసిందే. 

Also Read: India vs England warm-up match: వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా ఘన విజయం.. మెరిసిన Ishan Kishan, KL Rahul

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "అనసూయ లాంటి అందమైన అమ్మాయిలను జనాలు చూస్తారు. కానీ ఆమె వేసుకునే బట్టలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి.. ఆమె చక్కటి నటి, కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు. ఆమె అంటే నాకు మంచి గౌరవం ఉంది అందుకే డ్రెస్సింగ్ మారిస్తే బాగుంటది అని చెప్తున్నా" అంటూ కోట శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు. 

అయితే, కోటశ్రీనివాసరావు మాటలకు అనసూయ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. దీనికి స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ లలో ఒక పోస్ట్ పెట్టింది.. "ఒక సీనియర్ నటుడు నా డ్రెస్సింగ్ పైన చేసిన కామెంట్స్  చూసా.. నటనలో అపారమైన అనుభవం కలిగి ఉన్న ఆయన ఇలా మాట్లాడం బాధ కలిగించింది. వేసుకునే బట్టలు అనేవి వ్యక్తిగత అంశం. ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా అనవసరమైన విషయాల్ని హైలెట్‌ చేస్తోంది. అదే మీడియా.. ఆ సీనియర్‌ నటుడు మద్యం సేవిస్తారని కానీ, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని కానీ, ఆన్‌స్క్రీన్‌పై మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారని కానీ చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం! పెళ్లై పిల్లలున్న స్టార్‌హీరోలంతా హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు?" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Also Read: TS Inter exams 2021: ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్.. డౌన్‌లోడ్ కోసం tsbie.cgg.gov.in

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News