Syed Mushtaq Ali Trophy 2021 Winner: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక జట్టుపై తమిళనాడు ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో తమిళనాడు గెలిచింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేధించిన తమిళనాడు.. చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన క్రమంలో బ్యాటర్ షారుక్ ఖాన్ సిక్స్ కొట్టి.. జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో టోర్నీ చరిత్రలో మూడో సారి కప్‌ను అందుకుంది తమిళనాడు. అంతకుముందు 2006-07, 2020-21 సీజన్లోనూ కప్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన తమిళనాడుకు శుభారంభం దక్కలేదు. హరి నిశాంత్ (23) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ ఎన్ జగదీశన్ (41) ఒక్కడే స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. సాయి సుదర్శన్ (9), కెప్టెన్ విజయ్ శంకర్ (18), సంజయ్ యాదవ్ (5), ఎం.మహ్మద్ (5) విఫలమయ్యారు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు కావాల్సిన దశలో షారుక్ ఖాన్ అదరగొట్టాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా.. సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. కర్ణాటక బౌలర్లలో కరియప్పా 2, ప్రతీక్ జైన్, విద్యాధర్ పాటిల్, కరుణ్ నాయర్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగలు చేసింది. ఓపెనర్ రోహన్ కదమ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ మనీశ్ పాండే (13), కరుణ్ నాయర్ (18), శరత్ (16) ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభినవ్ మనోహర్ (46), ప్రవీన్ దూబె (33) మంచి ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో వచ్చిన సుచిత్ (18*) నాటౌట్ నిలిచాడు. తమిళనాడు బౌలర్లలో సాయి కిశోర్ 3, వారియర్, సంజయ్ యాదవ్, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!
Also Read: ఈడెన్ గార్డెన్స్ లో చెలరేగిన టీమ్ఇండియా.. న్యూజిలాండ్ తో సిరీస్ క్లీన్ స్వీప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook