మేఘాలయలో ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తోంది. ఒకవైపు అధికారం నిలబెట్టుకోవాలనే ఆరాటం కాంగ్రెస్ లో కనబడుతోంది. తొలి సారి గెలుపుబావుట ఎగురవేయాలని బీజేపీ ఉత్సాహంతో ఉంది. కాంగ్రెస్ కు అడ్డాగా నిలిచిన మేఘాలయ గడ్డపై బీజేపీ తొలిసారి 1998లో వాజ్ పేయి హయంలోమూడు స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ అక్కడ సీట్లు సాధించడం అదే తొలిసారి. అయితే ప్రస్తుతం మోడీ హయంలో అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. మోడీ చరిష్క ఇక్కడ కూడా పనిచేస్తుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. అయితే కడపటి వార్తలు అందే సరికి కాంగ్రెస్ 7, బీజేపీ 4, యూడీపీ 1, ఎన్‌పీపీ 11, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి.