Omicron Detection Kits: ప్రపంచాన్ని ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భయం వెంటాడుతోంది. అటు ఇండియాలో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌ను వెంటనే గుర్తించేందుకు వీలుగా కొత్తగా ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులో వస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant)దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో దేశంలో ఆందోళన అధికమైంది. కోవిడ్ లక్షణాలు గుర్తించిన తరువాత..ఏ వేరియంట్ అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించడం..ఆ ఫలితాలు వెలువడేందుకు సమయం పట్టడంతో కాస్త ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ఐసీఎంఆర్ సరికొత్త కిట్ అందుబాటులో తీసుకొస్తోంది. కొత్తగా ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్ రూపొందించింది. త్వరలో ఈ కిట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ఐసీఎంఆర్ ప్రయత్నిస్తోంది. ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు ఐసీఎంఆర్ బిడ్స్(ICMR BIDS) ఆహ్వానిస్తోంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆసక్తి కలిగిన సంస్థల్నించి బిడ్స్ ఆహ్వానించింది. ఐసీఎంఆర్ రూపొందించిన ఈ ఇన్‌విట్రో కిట్లకు కావల్సిన టెక్నాలజీని ఐసీఎంఆర్ బిడ్స్ దక్కించుకున్న సంస్థకు బదిలీ చేయనుంది.
ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కిట్‌ను ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన టెక్నాలజీ, పేటెంట్ హక్కులు, కమర్షియల్ హక్కులు మాత్రం ఐసీఎంఆర్ వద్దే ఉంటాయి. బిడ్స్ ద్వారా ఎంపిక చేసిన ఉత్పత్తిదారులతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ తరువాత అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీనోమ్ సీక్వెన్సింగ్ విధానంతో ఆలస్యమవడమే కాకుండా..ఖర్చు కూడా ఎక్కువవుతోంది. ఈ నేపధ్యంలో ఐసీఎంఆర్(ICMR)రూపొందించిన ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్లతో తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో ఫలితాలు వెలువడుతాయి.
మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. అటు కర్ణాటక, ఢిల్లీలో కూడా ప్రతిరోజూ కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కు పెరిగింది. అటు మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 53 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్లు(Omicron Detection Kits)అందుబాటులో వస్తే..కట్టడి సాధ్యమవుతుంది.
Also read: Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook