Banking Alert: బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకింగ్ వినియోగదారులకు ప్రస్తుతం ఏటీఎం ఛార్జీలు పరిమితి దాటిన తర్వాత.. ప్రతి లావాదేవీకి రూ.20 ఛార్జీగా వసూలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రూ.21కి (New ATM Charges) పెరగనున్నాయి. దీనికి జీఎస్టీ అదనం.
ఏటీఎం ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త ఛార్జీల గురించి సమాచారమివ్వడం ప్రారంభించాయి.
కొత్త రూల్స్ వివరాలు ఇలా..
ఏదైన బ్యాంక్ వినియోగదారుడు.. అదే బ్యాంక్ ఏటీఎంలో 5 సార్లు ఉచితంగా లావాదేవీలు (New Banking Rules) జరపొచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో అయితే మూడు సార్లు (మెట్రో నగరాల్లో), 5 సార్లు (నాన్ మెట్రో పట్టణాల్లో) పరిమితి.
బ్యాంక్ విధించిన ఈ పరిమితి దాటి.. తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ.21 (జీఎస్టీ అదనం) ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఏటీఎం లావాదేవీ నగదుతో కూడినదైన లేదా బ్యాలెన్స్ చెక్, మిని స్టేట్మెంట్ కోసం అయినా.. పరిమితి మాత్రం ఐదు సార్లే.
దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ రూల్స్‌ను అమలు చేయనున్నాయి.
కొత్త రూల్స్ నేపథ్యంలో తమ వినియోగదారులు.. చేసే ఏటీఎం లావాదేవీలపై ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్ పంపనున్నాయి బ్యాంకులు. ముఖ్యంగా ఉచిత లావాదేవీ పరిమితి దాటిన తర్వాత.. ఛార్జీల వసూలు గురించి సమాచారం ఇచ్చే వీలుంది.
Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook