iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా..ఈ సులభమైన టిప్స్ పాటించండి

మీ ఐఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా..ఈ ఐదు సులభమైన ట్రిక్స్ పాటిస్తే..ఛార్జింగ్ నిలబడుతుంది. ఐఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండాలంటే ఈ పద్ధతులు కొన్ని అలవాటు చేసుకోవల్సిందే. ఫలితంగా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సేపుండటమే కాకుండా అస్తమానూ ఛార్జింగ్ చేసే బాధ తప్పుతుంది. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం.

iPhone Battery: మీ ఐఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా..ఈ ఐదు సులభమైన ట్రిక్స్ పాటిస్తే..ఛార్జింగ్ నిలబడుతుంది. ఐఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉండాలంటే ఈ పద్ధతులు కొన్ని అలవాటు చేసుకోవల్సిందే. ఫలితంగా బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సేపుండటమే కాకుండా అస్తమానూ ఛార్జింగ్ చేసే బాధ తప్పుతుంది. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం.

1 /5

సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు ఎరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకోండి. దీనివల్ల మీకు ఫోన్లు ఏవీ రావు. వైఫై మాత్రం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని పద్థతుల ద్వారా ఐఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపుండేలా చేసుకోవచ్చు.

2 /5

యాప్స్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉంచడం మంచిది. కొన్ని అప్‌డేట్స్ ఫోన్ పనితీరును వేగవంతం చేస్తాయి. ఫలితంగా బ్యాటరీ అనవసరంగా ఖర్చు కాదు. ఆటోమేటిక్ యాప్ అప్‌డేట్ ఉంచుకుంటే మంచిది.

3 /5

మరో ముఖ్యమైన అంశం మీ ఫోన్ డిస్‌ప్లే. స్క్రీన్ డిస్‌ప్లే లైటింగ్ పూర్తిగా తగ్గించుకోవాలి. లేకపోతే బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. ఆటో బ్రైట్‌నెస్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా లైటింగ్ ఉండేట్టు చేస్తుంది. దాంతో బ్యాటరీ సేవ్ అవుతుంది. 

4 /5

బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ అవకుండా ఉండాలంటే..లో పవర్ మోడ్ ఆన్ చేయాలి. ఈ ఆప్షన్‌తో బ్యాటరీ నిలబడుతుంది. ఏది అవసరమో అదే ఆన్‌లో ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ సేవ్ అవుతుంది. 

5 /5

గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్‌ లొకేషన్ సర్వీస్‌కు అవసరం. కానా జీపీఎస్ పింగ్ బ్యాటరీని త్వరగా పాడు చేస్తుంది. అందుకే సెట్టింగ్ నుంచి ప్రైవసీ..తిరిగి లొకేషన్ సర్వీసెస్ ద్వారా లొకేషన్ సర్వీసెస్‌‌ను పూర్తిగా నిలిపివేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆన్ చేసుకోండి.