/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

SEBI New Rules: వివిధ రకాల పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులకు సంబంధించి సెబి కొత్త నిబంధనలు విధించింది. కొత్త పరిమితులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 

వివిధ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించి సెబీ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఇక నుంచి ఇష్టారాజ్యంగా షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్ని వినియోగించడానికి వీలులేదు. కొన్ని పరిమితుల్ని విధించింది సెబి. కొత్త నిబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం..భవిష్యత్ కొనుగోళ్లపై వెచ్చించే నిధులపై పరిమితి ఉంటుంది. ప్రధాన వాటాదారులకు షేర్లు జారీ చేయడంలో నిబంధనల మేరకు నడుచుకోవాలి. యాంకర్ ఇన్వెస్టర్ లాకిన్ గడువును 90 రోజులకు పొడిగించింది. ఈక్విటీ నిబంధనలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐసీడీఆర్ నిబంధనల్ని(ICDR Regulations) సవరించింది. 

సెబి తాజా నిబంధనల (Sebi New Rules) ప్రకారం అప్పటి వరకూ గుర్తించని భవిష్యత్ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకై ఐపీవో నిధుల్నించి 35 శాతం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఆఫర్ డాక్యుమెంట్‌లో ఉంటే మాత్రం పరిమితులుండవు. ఏదైనా కంపెనీలో 20 శాతానికి మించిన షేర్ హోల్డర్‌కు 50 శాతం వాటా ఆఫర్ చేయవచ్చు. 20 శాతం కంటే తక్కువ వాటా కలిగిన వ్యక్తులు 10 శాతం వాటాను విక్రయించే వీలుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50 శాతం వాటాను ప్రస్తుతం నెల రోజుల తరువాత విక్రయించే పరిస్తితి ఉంది. మిగిలిన 50 శాతాన్ని మూడు నెలల తరువాత అమ్ముకోవచ్చు. 2022 ఏప్రిల్ 1 నుంచి సెబి (SEBI) కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. 

Also read: Todays Gold Rate: బంగారం ధరకు బ్రేక్, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Sebi imposes new rules and regulations on usage of ipo funds, commences from April 1, 2022
News Source: 
Home Title: 

SEBI New Rules: సెబి కొత్త నిబంధనలు ఇవే, ఏప్రిల్ 1 నుంచి అమలు

SEBI New Rules: సెబి కొత్త నిబంధనలు ఇవే, ఏప్రిల్ 1 నుంచి అమలు
Caption: 
Sebi new rules ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
SEBI New Rules: సెబి కొత్త నిబంధనలు ఇవే, ఏప్రిల్ 1 నుంచి అమలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 18, 2022 - 12:34
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
82
Is Breaking News: 
No