Bed Room Facts: సినిమాల ప్రభావమో మరేంటో తెలియదు కానీ..చాలామంది శోభనం రాత్రిని విభిన్నంగా, ప్రత్యేకంగా ఊహించుకుంటారు. పందిరి మంచం గులాబీలతో అలంకరించడం, పాల గ్లాసుతో వధువు రావడం..అందరికీ తెలిసిందే. అయితే శోభనం రాత్రి మీ మంచాన్ని గులాబీలతోనే ఎందుకు అలంకరిస్తారో తెలుసుకుందాం.
పూవులకు సొంత భాష ఉంటుంది. పదాల్లాగే ఇతర భాషల్లో అనువాదం కలిగి ఉంటాయి. పూవుల్లో గులాబీలది ప్రత్యేక స్థానం. పూవుల్లో అత్యంత ఎక్కువగా ఆకర్షించేవి గులాబీలే. గులాబీలనేవి అందానికి, ప్రేమకు చిహ్నం. అందంతో పాటు పరిమళాన్ని వెదజల్లేది గులాబీలే. గులాబీల అందానికి వెలకట్టలేం. కేవలం మహిళలకే కాదు మగవారికి కూడా గులాబీలనేవి సెక్సువల్ సామర్ధ్యానికి సంకేతాలుగా నిలుస్తుంటాయి. శోభనం రాత్రి పడక గది అలంకరణకు గులాబీలు వాడటానికి ప్రాధమిక కారణం ఇదే.
కామోద్దీపణ కల్గిస్తుంది
ఆయుర్వేదం ప్రకారం గులాబీలు..సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఫీలయ్యేలా చేస్తాయి. మానవ శరీరంలోని రెండు దశల్లోనూ గులాబీల ప్రాధాన్యత ఇప్పటికే నిర్ధారణైంది. వాత, పిత, కఫ, సాధక పిత, ప్రణ వాతలను ప్రేరేపిస్తాయి. గులాబీను పాలలోనూ లేదా పాయసంలో కూడా ఓ ఫ్లేవర్‌గా కూడా ఉపయోగిస్తారు.
ఒత్తిడి, ఆవేశాన్ని తగ్గించేందుకు గులాబీలు ( Roses) దోహదపడతాయి. ప్రతి ఒక్కరిని ఆనందంగా, ఉత్తేజంగా ఉంచుతాయి. రోజ్ సెంటెడ్ వాతావరణంలో బెడ్‌పై వెళ్లినప్పుడు ఆహ్లాదకరమైన ఆలోచనలతో భాగస్వామిని ఎక్కువగా సంతోషపెట్టేందుకు సహాయపడతుందని ఓ అధ్యయనం ప్రకారం తెలిసింది. గులాబీలు ఓ వ్యక్తి మూడ్‌ను మార్చగలవు. గులాబీలు ఉత్తేజితం చేయగలవు. గులాబీలకుండే ఏదో తెలియని మత్తు..పడక గదిలో అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. అందుకే శోభనపు రాత్రి పడక గదులు గులాబీలతో ప్రత్యేకంగా అలంకారమై..సిద్ధంగా ఉంటాయి.
Also read: Chocolate Day 2022: చాక్లెట్ డే సందర్భంగా మీరు ఇష్టపడే వారికి ఈ బహుమతులు ఇవ్వండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook