Aishwarya Dhanush: పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్.. మళ్లీ ఆసుపత్రిపాలైన ఐశ్వర్య ధనుష్..

Aishwarya Dhanush Hospitalised: కోలీవుడ్‌ డైరెక్టర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి ఆసుపత్రిపాలయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 05:24 PM IST
  • మళ్లీ ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య
  • పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలే కారణం
  • ఇన్‌స్టాలో వెల్లడించిన ఐశ్వర్య
Aishwarya Dhanush: పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్.. మళ్లీ ఆసుపత్రిపాలైన ఐశ్వర్య ధనుష్..

Aishwarya Dhanush Hospitalised: కోలీవుడ్‌ డైరెక్టర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి ఆసుపత్రిపాలయ్యారు. కొద్ది రోజుల క్రితమే కోవిడ్ నుంచి కోలుకున్న ఐశ్వర్య.. తాజాగా జ్వరం, వర్టిగో సమస్యతో ఆసుపత్రిలో చేరారు. పోస్ట్ కోవిడ్ కారణంగానే అనారోగ్యం బారినపడినట్లు ఐశ్వర్య ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించారు.

'జీవితం కరోనాకు ముందు కరోనా తర్వాత.. జ్వరం, వర్టిగో కారణంగా మళ్లీ ఆసుపత్రిలో చేరాను. అయితే మీరు కలవబోయేది ఒక అందమైన, స్పూర్తిదాయకమైన డాక్టర్ అయినప్పుడు ఆసుపత్రిలో చేరడం అంత చెడ్డగా ఏమీ అనిపించదు. మహిళా దినోత్సవానికి ముందు డాక్టర్ ప్రీతికా చారిని కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.' అని ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. ఆసుపత్రి బెడ్‌పై నవ్వులు చిందిస్తున్న ఫోటోను ఆ పోస్టులో షేర్ చేశారు. ఐశ్వర్య పక్కనే ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉన్నారు. 

ఐశ్వర్య త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గత నెలలోనే ఐశ్వర్య కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకు కోలుకున్న ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అంతకు కొద్ది రోజుల ముందే ఐశ్వర్య-ధనుష్ దంపతులు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఈ ఇద్దరు హఠాత్తుగా విడాకులు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ ఇద్దరూ మళ్లీ కలుస్తారంటూ కొద్ది రోజుల క్రితం ధనుష్ తండ్రి కస్తూరి రాజా పేర్కొన్నప్పటికీ.. ఇప్పటికైతే ఆ సూచనలు కనిపించట్లేదు. విడాకుల తర్వాత అటు ఐశ్వర్య, ఇటు ధనుష్ తమ అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో మునిగిపోయారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryaa_r_dhanush)

Also Read: Singareni Coal Mine Accident: సింగరేణి బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News