Chance to Meet Prabhas: రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే, ప్రభాస్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం

Chance to Meet Prabhas: రెబెల్‌స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రమోషన్ విభిన్నంగా సాగుతోంది. సినిమా అంచనాల్ని పెంచేందుకు ఇవాళ కొత్తగా ఎన్ఎఫ్‌టి లాంచ్ కానుంది. ప్రభాస్‌ను నేరుగా కలిసే అదృష్టాన్ని పరీక్షించుకోండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2022, 12:14 PM IST
Chance to Meet Prabhas: రాధేశ్యామ్ ఎన్ఎఫ్‌టి లాంచ్ నేడే, ప్రభాస్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం

Chance to Meet Prabhas: రెబెల్‌స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రమోషన్ విభిన్నంగా సాగుతోంది. సినిమా అంచనాల్ని పెంచేందుకు ఇవాళ కొత్తగా ఎన్ఎఫ్‌టి లాంచ్ కానుంది. ప్రభాస్‌ను నేరుగా కలిసే అదృష్టాన్ని పరీక్షించుకోండి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. చేతిలో 5-6 పాన్ ఇండియా మూవీలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విభిన్నంగా, వినూత్నంగా రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో ఉన్నాడు. ప్రతి ఛానెల్, ప్రతి వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఇవాళ సరికొత్తగా అభిమానుల కోసం సినిమా ఎన్‌ఎఫ్‌టీ లాంచ్ చేస్తున్నారు. ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్, ఎక్స్‌క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్సర్స్ ఉంటాయి. రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ నడిపిన కారు 3డి యానిమేటెడ్ ఎన్ఎఫ్‌టి ఉంటుంది. ఇవాళ్టి నుంచి ఈ ఎన్ఎఫ్‌టి అమ్మకాలు కొనసాగుతాయి. 

అంతవరకూ ఓకే. కానీ ప్రభాస్‌ను కలిసే అవకాశమేంటనుకుంటున్నారా. ఈ డిజిటల్ కలెక్షన్స్‌లో లక్కీ విన్నర్స్ ఎంపిక ఉంటుంది. లక్కీ విన్నర్స్‌గా ఎంపికైన వందమందికి నేరుగా ప్రభాస్ ను కలిసే అవకాశం కల్పించనున్నారు. అంతేకాదు ఎన్ఎఫ్‌టీలు ఎవరెక్కువ కొనుగోలు చేస్తే వారికి ఇష్టమైన నటుడిని కలిసేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు వాయిస్ అందించడం విశేషం. మరి మీక్కూడూ ప్రభాస్‌ను కలవాలని ఉందా..అయితే త్వరపడండి మరి. 

Also read: Mahesh babu with Ali Bhatt: త్వరలో రాజమౌళి, అలియా భట్, మహేశ్ బాబు కాంబినేషన్ మూవీ, ఇవే ఆ వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News