MCC New Rules: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. ఇకపై మన్కడింగ్‌ నిషేధం! లాలాజలం రుద్దితే అంతేసంగతులు!!

MCC Rule Change on Mankading. క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ లా నిబంధనల్లో మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) కీలక మార్పులు చేసింది. మ‌న్క‌డింగ్‌ (నాన్‌స్ట్రైకర్‌ బ్యాటర్‌ రనౌట్‌), బంతికి లాలాజ‌లం పూయ‌డం, క్యాచ్ ఔట్ స్ట్రైకింగ్ విష‌యంలో కీలక మార్పులు చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 03:33 PM IST
  • క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పులు
  • ఇకపై మన్కడింగ్‌ నిషేధం
  • లాలాజలం రుద్దితే అంతేసంగతులు
MCC New Rules: క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పులు.. ఇకపై మన్కడింగ్‌ నిషేధం! లాలాజలం రుద్దితే అంతేసంగతులు!!

MCC Rule Change on Mankading: క్రికెట్‌ కోడ్‌ ఆఫ్ లా నిబంధనల్లో మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) కీలక మార్పులు చేసింది. మ‌న్క‌డింగ్‌ (నాన్‌స్ట్రైకర్‌ బ్యాటర్‌ రనౌట్‌), బంతికి లాలాజ‌లం పూయ‌డం, క్యాచ్ ఔట్ స్ట్రైకింగ్ విష‌యంలో కీలక మార్పులు చేసింది. వీటితో పాటు మరికొన్ని కొత్త రూల్స్‌ను ఎంసీసీ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో దీనిపై ఒక ప్రకటన విడుదల చేయనుంది. అయితే ఈ రూల్స్ ఈ ఏడాది అక్టోబర్‌ వరకు అమల్లోకి రావు. ఆలోపు అంతర్జాతీయంగా అంపైర్లు, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వనుంది.

మన్కడింగ్‌పై నిషేధం:
బౌలర్‌ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజు దాటితే సదరు బౌలర్‌ అతన్ని ఔట్‌ చేసే అవకాశాన్ని మన్కడింగ్‌ అంటారు. ఈ విధానాన్ని పూర్తిగా నిషేధిస్తున్న‌ట్లు ఎంసీసీ పేర్కొంది. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉండే ఏ బ్యాటర్‌ అయినా పరుగు కోసం సిద్ధంగా ఉంటాడని, దానిలో భాగంగా బ్యాటర్‌ క్రీజు దాటే అవకాశం ఉంటుంద‌ని పేర్కొంది. అలాంటి స‌మ‌యంలో మ‌న్క‌డింగ్ పేరుతో బౌల‌ర్.. బ్యాట‌ర్‌ను ఔట్ చేయ‌డం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయ‌ప‌డింది. ఇందులో భాగంగా క్రికెట్‌ నిబంధన లా-41 (క్రీడాస్పూర్తికి విరుద్ధం), లా-38(రనౌట్‌) ప్రకారం మన్కడింగ్‌ను రూల్స్‌ నుంచి తొలగించారు. ఇకపై మన్కడింగ్‌ నిషేధమని ఎంసీసీ స్పష్టం చేసింది.

క్యాచ్ ఔట్ స్ట్రైకింగ్:
బ్యాట‌ర్ క్యాచ్ ఔట్ అయిన‌ప్పుడు కొత్త బ్యాట‌ర్ స్ట్రైక్ విష‌యంలోనూ ఎంసీసీ కీలక మార్పు చేసింది. ఓ బ్యాట‌ర్ క్యాచ్ ఔట్ అయిన తర్వాత కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ చేయాల్సి  ఉంటుంది. క్యాచ్ ఔట్ అయ్యేసరికి బ్యాట‌ర్లు ఇద్ద‌రు సగం పిచ్ దాటినా కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఇంతకముందు ఏ బ్యాటర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కు వెళ్లాలనే నిబంధన ఉంది.

బంతిపై లాలాజ‌లం ఉపయోగించకూడదు:
ఇంత‌కుముందు బౌల‌ర్లు బంతి స్వింగ్ అయ్యేందుకు దానిపై లాలాజ‌లం, చెమట పూసేవారు. క‌రోనా వైరస్ కారణంగా బౌల‌ర్లు బంతిపై లాలాజ‌లంను పూయడాన్ని ఎంసీసీ నిషేధించింది. తాజాగా దీనిని ఎంసీసీ పూర్తిగా నిషేధించింది. బంతిపై లాలాజ‌లం పూయ‌డం వ‌ల్ల‌ బంతి ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యంపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని, ఇక‌పై బౌల‌ర్లు అలా చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది. దీనిపై ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో నిషేధం విధించారు.

బంతి కొద్ది దూరంలో వెళ్లినా:
క్రికెట్‌లోని లా 22.1 ప్రకారం స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ నిల్చున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా.. దానిని వైడ్‌గా పరిగణించాలనే కొత్త రూల్‌ను వచ్చింది. డెడ్‌ బాల్స్‌తో పాటు కట్‌స్ట్రిప్‌ దాటిన బంతిని బ్యాటర్ టచ్‌ చేసే విషయంలోనూ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే ఐసీసీ విడుదల చేయనుంది. 

Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌... కేవలం 22 రోజుల్లోనే అనుమతి!

Also Read: Ganja Seized in Warangal: వరంగల్‌లో భారీగా గంజాయి పట్టివేత... అంతర్ రాష్ట్ర ముఠా అరెస్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News