Vastu Tips: ఈ వాస్తు సలహాలు పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదట!

Vastu Tips: ఇంట్లో సిరి-సంపదల విషయంలో వాస్తు కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. మరి వారి ప్రకారం ఇంట్లో ఎలాంటి వాస్తు సలహాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2022, 05:18 PM IST
  • ఇంటి నిర్మాణంలో వాస్తు సలహాలు
  • సంపద ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు
  • ఇంటికి ఎలాంటి రంగులు వాడాలి
Vastu Tips: ఈ వాస్తు సలహాలు పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు కొదవే ఉండదట!

Vastu Tips: ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రవహిస్తుంది. ఇంకా చెప్పాలంటే సాధారణ ప్రజలు ఎవరు కూడా నాకు డబ్బు అవసరం లేదే అని చెప్పుకోరు. డబ్బు ఉందంటే.. కావాల్సిన పనులు చేయొచ్చు. సంఘంలో కూడ డబ్బు ఉంటేనే గౌరవిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు.

అయితే వాస్తు నిపుణుల ప్రకారం.. ఇంటి వాస్తు కూడా ఆ ఇంట్లో ఉండే వారి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మరి ఇంట్లో ధనం ఉండాలంటే.. ఎలాంటి వాస్తు నిబంధనలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కీలక సూత్రాలను మరవద్దు..

ప్రతి ఇంటి నిర్మాణంలో ఐదు అంశాలు, 16 మహావాస్తు జోన్లు కీలకంగా ఉంటాయి. అందుకే వాస్తు నిపుణులను సంప్రదించి వీటిపట్ల జాగ్రత్తగా ఉంటే ఇంట్లో సిరి సంపదలకు కొదవే ఉండందంటున్నారు నిపుణులు.

వాస్తు గురించి పూర్తిగా తెలుకోండి..

కొంత మంది ఇళ్లు నిర్మించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అలాంటివారెవరైనా ఉంటే.. ఇంటి వాస్తు గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. ఓ వాస్తు నిపుణుడిని ఇంటికి పిలిచి.. ఏవైనా లోపాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలని చెబుతున్నారు.

ఉత్తర వాస్తు జోన్​ రంగు..

ఉత్తర వాస్తు జోన్​ రంగు అనేది చాలా ముఖ్యమైనదని వాస్తు నిపుణులు చెబగుతుంటారు. అందు వైపు ఉన్న గోడకు నీలి రంగు వేయడం మంచిదని చెబుతున్నారు. ఎరుపు రంగు వంటివి వేయొద్దని సూచిస్తున్నారు.

వాటికి ప్రత్యేక ప్రాంతం అవసరం..

ఇంట్లో వంటగది, బాత్​రూమ్​కు ప్రత్యేక ప్రాంతం అవసరం. ఈ ప్రాంతాల్లో డస్ట్​బిన్స్​, వాషింగ్ మిషిన్స్​ సహా ఇతర ఎలక్ట్రానిక్స్​ పెట్టొద్దట. ముఖ్యంగా వంటగది స్థానం మార్చడం సరికాదని సూచిస్తున్నారు. వంటగది మంటను సూచిస్తుందని.. అందుకే తప్పుడు ప్రాంతంలో కిచెన్​ పెట్టడం వల్ల సంపద, అవకాశాలు హరించుకుపోతాయనే సంకేతాలు వస్తాయని చెబుతున్నారు.

వంటగది ఇంటికి ఆగ్నేయంగా ఉండాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. వంటగదికి నారిజ, గులాబి రంగులు వేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఇంట్లో సంపద కలకలలాడాలంటే..  వర్క్​ టేబుల్​, డ్రాయింగ్​ రూం వంటివాటిని ఉత్తర దిశలో పెట్టడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

రంగుల విషయంలో జాగ్రత్తలు..

ఇంటికి పశ్చిమవైపు తెలుపు, పసుపు రంగులు వేయడం శుభసూచికాలుగా చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా నైరుతి జోన్​ను పొదుపు జోన్​గా పరిగణిస్తుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని వాస్తు నిపుణులు అంటు్నారు. ఈ ప్రాంతంలో డబ్బుకు సంబంధించిన వస్తువులు, విలువైన వస్తువులు పెట్టడం మంచిదని వివరిస్తున్నారు.

(నోట్​: ఈ కథనంలోని విషయాలన్నీ వాస్తు నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. ఇందులోని అంశాలను ZEE తెలుగు NEWS ధృవీకరించలేదు.)

Also read: Holi 2022 Celebration: హోలీ సెలెబ్రేషన్స్.. ఒక్క నిమిషంలో 100 బెలూన్స్ నీటితో నింపొచ్చు!

Also read: Anti Ageing Facepack: వయస్సు 40 ఏళ్లు దాటినా..యవ్వనంగా ఉంచే ఫేస్‌ప్యాక్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News