Doctor Suicide: వరకట్న వేధింపులు తాళలేక వైద్యురాలు మృతి

వరకట్న వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేటలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 06:06 PM IST
  • వరకట్న వేధింపులు..తాళలేక వైద్యురాలు బలి
  • మలక్‌పేట పీఎస్‌ పరిధిలో దారుణం
  • అదనపు కట్నం వేధింపులు భరించలేక వైద్యురాలు ఆత్మహత్య
Doctor Suicide: వరకట్న వేధింపులు తాళలేక వైద్యురాలు మృతి

MBBS Doctor Suicide: వారు ఇద్దరు  వైద్య వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరిదీ రెండో వివాహమే. కానీ ఆ ఇద్దరి పండంటి కాపురాని వరకట్నమే పులిస్టాప్‌ పెట్టింది. వరకట్న వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేటలో చోటుచేసుకుంది. భార్యను పొట్టన పెట్టుకున్న భర్త ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇలా దేశంలో రోజు ఎక్కడో ఒక చోట వరకట్నం వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యంగంలో వరకట్నం నిషేదం చట్టాలున్నా వాటిని పట్టించుకోకుండా విచ్చల విడిగా వరకట్నాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. 

అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె, స్వప్న (38) వైద్యురాలు తొలి వివాహం మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో చేశారు. ఖమ్మం జిల్లా పీహెచ్‌సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో విడాకులు తీసుకుంది స్వప్న. దీంతో స్వప్న కొన్ని రోజులు ఒంటరిగానే జీవనం సాగించింది. కర్నూలుకు చెందిన డాక్టర్‌ శ్రీధర్‌తో 2015 ఏప్రిల్‌లో రెండో వివాహం జరిగింది. అయితే కుటుంబీకులు వరకట్నంగా రూ.10లక్షల నగదు, 14 తులాల బంగారం కట్నం కింద అందజేశారు. అమెకు నగరంలోని ప్రముఖ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎండీగా సీటు వచ్చింది. 

సైదాబాద్‌లోని వెంకటాద్రినగర్‌లో వీరు నివాసంగా ఉంటున్నారు. అయితే స్వప్నను అమె భర్త అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె మానసిక వేదనకు గురైన ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అయితే ఆమె తల్లిదండ్రులు మానసిక వైద్యుడికి చూపించారు. ఇంట్లో సగ భాగం ఆస్తి, తల్లి బంగారు నగలు తీసుకురావాలని శ్రీధర్‌ చాలా సార్లు ఒత్తిడి తెచ్చాడని ఆమె తండ్రి పోలీసులకు వివరించారు.అయితే శ్రీధర్‌ వేధింపులు తట్టుకోలేక స్వప్న ఆత్మహత్య చేసుకుంది. దీంతో శ్రీధర్‌పై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.డాక్టర్‌ శ్రీధర్‌ను  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

Aslo Read: Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కేన్ మామ ఔట్! కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!!

Aslo Read: RRR AP Tickets: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News