Birbhum Violence: రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో అధికార మరియు విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీర్ భూం సజీవదహనాల ఘటనపై సీఎం మమతాబెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయగా.. కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు ప్రజాప్రతినిధులు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2022, 02:38 PM IST
  • రణరంగమైన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ
  • ఘటనపై తృణమూల్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
  • సభనుంచి సస్పెండ్ ఐన నలుగురు ఎమ్మెల్యేలు
Birbhum Violence: రణరంగంగా మారిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ.. నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

Birbhum Violence: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ రణరంగమైంది. బీర్ భూం సజీవదహనాల ఘటనపై అధికార తృణమూల్, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదికాస్తా ముదిరి తీరా ఒకర్నొకరు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పశ్చిమబెంగాల్ లోని బీర్‌భూంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనమిది మంది సజీవదహనమయ్యారు.

ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చకు విపక్ష బీజేపీ పట్టుబట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా తయారైందని.. దీనిపై సీఎం మమతాబెనర్జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలను టీఎంసీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేల మద్య గొడవ పెద్దదై కొట్టుకునేదాకా వెళ్లింది

ఘటనపై బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండాపోయిందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. అసెంబ్లీలో కావాలని గందరగోళం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అటు ఈ ఘటనలో సువేందు అధికారితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ సభనుంచి సస్పెండ్ చేశారు. 

ఈ నెల 21 న పశ్చిబెంగాల్ లోని బీర్ భూం జిల్లా బర్షాల్ గ్రామంలో తృణమూల్ పార్టీనేత బాదుషేక్ ను హత్యచేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే బోగ్‌టూయి గ్రామంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇళ్లు కాలిబూడిదై 8 మంది సజీవదహనమయ్యారు. తృణమూల్ నేత హత్యకు ప్రతీకారంగానే టీఎంసీ కార్యకర్తలు ప్రత్యర్థుల ఇళ్లకు నిప్పుపెట్టినట్లు విపక్షాలు ఆరోపించాయి. పోస్టుమార్టం నివేదిక కూడా హత్యకుముందు వారిని తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కోల్‌కతా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సీబీఐ 22 మందిని అరెస్ట్ చేసింది.

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?

Also Read: Oscar Awards 2022: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం, ఆస్కార్ అవార్డు విజేతల జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News