Axis bank: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్.. మరో ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ సిటీ గ్రూప్ రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డీల్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఇక ఈ డీల్ గురించి అవగాహన ఉన్న వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. 2.5 బిలియన్ డాలర్ల (రూ.18 వేల కోట్లు)తో సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాలను
యాక్సిస్ గ్రూప్ దక్కించుకోనున్నట్లు తెలిసింది. 2021 ఏప్రిల్‌లో.. భారత్‌లో రిటైల్ వ్యాపారాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సిటీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా వెల్లడించింది. దీనితో సిటీ రిటైల్ వ్యాపారాలను ఏ సంస్థ కొనుగోలు చేస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోటక్ మహీంద్రా సహా వివిధ బ్యాంకుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఇందుకు సిద్ధమైనట్లు సమాచారం.
సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాలు..
సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాల్లో.. క్రెడిట్ కార్డ్స్, రిటైల్ బ్యాంకింగ్, హోం లోన్స్, వెల్త్ మేనేజ్మెంట్, వంటి సేవలు ఉన్నాయి. భారత్‌లో సిటీ గ్రూప్‌కు 35 బ్రాంచ్‌లు, 4.000 మంది ఉద్యోగులు ఉన్నారు.
సిటీ గ్రూప్ 1902లో భారత్‌లోకి ప్రవేశించింది. 1985లో బ్యాంకింగ్ బిజినెస్ సేవలు ప్రారంభించింది.
యాక్సిస్ బ్యాంక్ సిటీ గ్రూప్ మధ్య ఒప్పందానికి నియంత్రణ పరమైన అనుమతులు లభిస్తే.. బ్యాంకింగ్ వ్యాపారాల్లో యాక్సిస్ పరిది మరింత విస్తరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. యాక్సిస్ బ్యాంక్ సిటీ గ్రూప్ మధ్య డీల్ గురించి ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నించగా అందుకు స్పందన రాలేదని తెలిపారు విశ్లేషకులు.
Also read: DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్- మరో 3 శాతం పెరిగిన డీఏ!
Also read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన డీజిల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook