Rabbit- Snake Fight: ప్రమాదకరమైన పాముతో చిన్న కుందేలు ఫైట్, వీడియో వైరల్

Rabbit- Snake Fight Video:  మీరు కుందేలు, పాము పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఈ వీడియో చూసేయండి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 02:17 PM IST
Rabbit- Snake Fight: ప్రమాదకరమైన పాముతో చిన్న కుందేలు ఫైట్, వీడియో వైరల్

Rabbit- Snake Fight Video:  మీరు సోషల్ మీడియాలో (Social Media) జంతువుల మధ్య జరిగే పోరాట వీడియోలు చాలానే చూసే ఉంటారు. సాధారణంగా పాము, ముంగిస బద్దశత్రువులుగా పరగణిస్తారు. ఈ రెండింట మధ్య జరిగే కొట్లాట వీడియోలు నెట్టింట చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక చిన్న కుంందేలు, ప్రమాదకరమైన పాముతో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. 

ఓ పొలంలో ప్రమాదకరమైన పాముతో చిన్న కుందేలు (rabbit) పోరాడుతున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిన్న కుందేలు ఇంత భారీ విషపూరితమైన పాముకి (Snake) ఏమాత్రం భయపడకుండా పోరాడుతోంది. చివరకు ఈ చిన్న కుందేలు..ఆ పామును అక్కడి నుంచి పారిపోయేలా చేస్తోంది. ఆ కుందేలు ధైర్యానికి నెటిజన్లు ఫిధా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐾 FAN OF PREDATOR 🔞 (@predator.unity)

ఈ వీడియో ప్రిడేటర్.యూనిటీ (predator.unity) అనే ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాతో షేర్ చేయబడింది. ఈ వీడియో అప్ లోడ్ చేయబడిన కొన్ని గంటలకే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అంతేకాకుండా ఈ వీడియో మిలియన్ల సార్లు వీక్షించబడింది. ఈ వీడియోను వేల మంది లైక్ కూడా చేశారు. 

Also Read: OMG: మహిళ శరీరం నుంచి బయటకొచ్చిన ఆత్మ... బిగ్గరగా నవ్వుతూ భయపెట్టేసింది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News