Electric Scooter Catches Fire: ఆకాశం వైపు దూసుకెళ్తున్న పెట్రోల్ రేట్లను చూసి బెంబేలెత్తిపోతున్న జనం.. ఎలక్ట్రిక్ బైక్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బైక్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రోడ్లపై బ్యాటరీ బైకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, బ్యాటరీ బైకులు పేలిపోవడం, కాలిపోవడం వంటి ఘటనలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి.
కొద్దిరోజులుగా బ్యాటరీ బైకులు కాలిపోతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో, బ్యాటరీ బైకులంటే మోజు పెంచుకుంటున్న వాళ్లకు ఇలాంటి పరిణామాలు అంతకంటే ఎక్కువగా భయపెడుతున్నాయి. మొన్నటికి మొన్న విజయవాడలో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలిపోయి ఓ వ్యక్తి మరణించాడు. తెలంగాణలోనూ బ్యాటరీ పేలి ఒకరు మృతిచెందారు. తమిళనాడులోనూ బ్యాటరీ బైక్‌లో మంటల కారణంగా తండ్రీకూతురు చనిపోయారు. ఇప్పుడు తమిళనాడులో మరో సంఘటన జరిగింది. ఓ బ్యాటరీ బైక్ కాలిపోయింది. అయితే, నడిరోడ్డుమీద వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగానే బైక్ సీటు కిందనుంచి మంటలు వచ్చాయి. ఈ పరిణామం రోడ్డుమీద వాహనదారులు, ప్రయాణికులను అందరినీ హడలెత్తించింది.
సీటు కిందనుంచి మంటలు రావడంతో ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బైక్ ఆపేసి పక్కనే ఉన్న ఓ ఇంట్లో నుంచి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దారిలో వెళ్తున్న వాళ్లు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ, బైక్ వెనుకభాగం పూర్తిగా కాలిపోయింది.
తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరులో ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే సతీష్ గత యేడాది ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. సతీష్ సొంతూరు హోసూరు. శనివారం బ్యాటరీ బైక్‌పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సీటు కిందనుంచి మంటలు వచ్చాయి. అయితే మంటలు ఆర్పేలోపే బైక్ సగభాగం కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్..
Also Read: యాదాద్రి గుట్ట పైకి కారులో వెళ్తున్నారా.. పార్కింగ్ ఫీజు తెలిస్తే చుక్కలు కనిపించడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.