OLA S1 Pro Scooter Problmes: గతేడాది ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ అయిన ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కస్టమర్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ పదే పదే ట్రబుల్ ఇస్తున్నాయని కస్టమర్స్ కంపెనీకి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని ఒకరు ఏకంగా స్కూటర్‌నే తగలబెట్టాడు. స్కూటర్ మధ్యలో ఆగిపోవడంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పృథ్వీరాజ్ అనే ఆ వ్యక్తి 3 నెలల క్రితం ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. అప్పటినుంచి స్కూటర్ తరచూ ట్రబుల్ ఇస్తూనే ఉంది. కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేయగా... ఓ టీమ్ వచ్చి స్కూటర్‌ను పరిశీలించింది. బండి మంచి కండిషన్‌లోనే ఉందని ఆ టీమ్ అతనితో చెప్పింది. కానీ బండి ట్రబుల్ ఇవ్వడం మాత్రం ఆగలేదు. ఇటీవల ఓరోజు ఏదో పని నిమిత్తం అతను స్కూటర్‌పై బయటకెళ్లగా సడెన్‌గా మధ్యలో ఆగిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మహారాష్ట్రలోని పర్లీకి చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి కూడా ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇలాగే ట్రబుల్స్ ఎదుర్కొన్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో స్కూటర్‌ను బుక్ చేయగా... ఈ ఏడాది మార్చి 24న అతనికి స్కూటర్ అందింది. అయితే వారం రోజులకే అది మొరాయించింది. దీనిపై ఓలా కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేయగా... ఓలా మెకానిక్ వచ్చి బండిని పరిశీలించారు. అయినప్పటికీ స్కూటర్ బాగవలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యక్తి... స్కూటర్‌ను గాడిదకు కట్టి ఊరేగించాడు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను ఉపయోగించవద్దని... ఓలా కంపెనీని నమ్మవద్దని స్కూటర్‌కు పోస్టర్లు అంటించి నిరసన తెలిపాడు. ఓలా కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీనిపై కన్స్యూమర్ ఫోరమ్‌లోనూ ఫిర్యాదు చేశాడు.
మరోవైపు, ఓలా యాజమాన్యం.. ఇండియాలో విక్రయించిన 1441 ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూటర్స్‌లో తలెత్తుతున్న సమస్యలను సమగ్రంగా విశ్లేషిస్తున్నట్లు ఓలా యాజమాన్యం తెలిపింది.
பழுதான 'ஒலா' எலக்ட்ரிக் பைக்
பெட்ரோல் ஊற்றி கொளுத்திய நபர்!https://t.co/40NriB9Bfq | #Ola | #bike | #Set | #Fire | #ZeeTamilNews pic.twitter.com/riixvxRfgB— Zee Tamil News (@ZeeTamilNews) April 26, 2022
Also Read: Ganesh Puja Tips: బుధవారం గణపతి పూజ... ఈ నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook