Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... త్వరలో సామ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్...

Soon Big Annoucement from Samantha: హీరోయిన్ సమంత భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంతకం చేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 10:19 PM IST
  • సమంత ఫ్యాన్స్‌కు త్వరలో గుడ్ న్యూస్
  • మరో భారీ ప్రాజెక్టుకు సమంత గ్రీన్ సిగ్నల్
  • ఓ యువ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా
Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... త్వరలో సామ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్...

Soon Big Annoucement from Samantha: బ్యూటీ క్వీన్ సమంత మరో భారీ ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ యువ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దర్శక, నిర్మాతలు దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికైతే సమంత నుంచి దీనిపై ఎటువంటి ప్రకటన కానీ లీకులు కానీ రాలేదు. 

సమంత మరో భారీ ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు గాసిప్స్ వినిపిస్తుండటంతో.. సినిమా వివరాలపై ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. సమంత ఓకె చేసిన ఆ దర్శకుడు ఎవరా అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన 'శాకుంతలం', హరి-హరీశ్ ద్వయం దర్శకత్వంలో నటించిన 'యశోద' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఇది గాక విజయ్ దేవరకొండ సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమాలో సమంత నటిస్తోంది.

ఇండియన్ సినిమాలే కాదు హాలీవుడ్‌లోకి కూడా సమంత ఎంట్రీ ఇస్తోంది. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో 'అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' సినిమాలో సమంత నటిస్తోంది. ఈ సినిమాలో సమంత బైసెక్సువల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్‌పై మరింత ఫోకస్ చేసింది. గతంలో కన్నా స్పీడ్‌ కన్నా సినిమాలను పట్టాలెక్కిస్తోంది. సమంత తాజాగా సంతకం చేసిన భారీ ప్రాజెక్టు వివరాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

Also Read: Hero Vijay Meet KCR: కేసీఆర్ తో తమిళ హీరో విజయ్ భేటీ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నారా?

Also Read : Venus Transit 2022: మేష రాశిలోకి శుక్రుడు... ఎవరికి శుభం, ఎవరికి అశుభం.. ఏయే రాశులపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News