KCR Farmhouse: ఫాం హౌజ్ లో కేసీఆర్ చేస్తున్నది ఇదా..కేసీఆర్ ను చూసి షాక్ అవుతున్న క్యాడర్

KCR Farmhouse బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ఎందకు మౌనంగా ఉంటున్నట్లు...? అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే  ఎందుకు పరిమితమైనట్లు......? ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు.....? ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంత.....?  ఫాం హౌజ్ లో కేసీఆర్ ను కలుస్తున్న కార్యకర్తలకు ఏం చెబుతున్నారు.....? కేసీఆర్ ను కలిసిన ముఖ్య నేతలు ఎందుకు షాక్ అవుతున్నారు.....? 

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Sep 30, 2024, 03:28 PM IST
KCR Farmhouse: ఫాం హౌజ్ లో కేసీఆర్ చేస్తున్నది ఇదా..కేసీఆర్ ను చూసి షాక్ అవుతున్న క్యాడర్

KCR Farmhouse: తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని పరిపాలించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గుర్తింపు పొందారు. అంతే కాదు ఉద్యమ నాయకుడి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే కీలక బాధ్యతలు చేపట్టాడు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తనదైన శైలిలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. సంచలనమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ జనాలకు చాలా దగ్గరయ్యారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాయి.. ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పరిపాలనా దక్షతను పలువురు కొనియాడారు. రైతుబంధు, 24గంటల కరెంట్ లాంటి పథకాలతో తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ మరింత చేరువయ్యారు.. సమైక్య పాలనకు ప్రత్యేక రాష్ట్రంలో  పాలనకు తేడాను చెబుతూనే తన కంటూ ఒ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 

పదేళ్ల పాటు తెలంగాణను నిర్విరామంగా పరిపాలించాడు. అలాంటి కేసీఆర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. కేసీఆర్ ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు వస్తున్న క్రమంలోనే కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం ఐన ప్రగతి భవన్ నుంచి ఎర్రవళ్లిలోని తన సొంత కారులో సాదాసీదాగా ఫాం హౌజ్ కు చేరుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఫాం హౌజ్ లోనే కేసీఆర్ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. గత పది నెలల కాలంలో అడపాదడపా హైదరాబాద్ లోని నంది నగర్ నివాసం లేదా తెలంగాణ భవన్ కు మాత్రమే వచ్చారు. మిగితా సమయం అంతా కేసీఆర్ ఫాం హౌజ్ లోనే గడుపుతున్నారు.

అసలు కేసీఆర్ ఫాం హౌజ్ లో ఏం చేస్తున్నారని సోషల్ మీడియాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓటమి తర్వాత కేసీఆర్ డీలా పడ్డారని కొందరు,   ఓటమి నుంచి కేసీఆర్ కోలువకోవడం లేదని మరి కొందరు, ఇంకొందరైతే అసలు కేసీఆర్ ఆనారోగ్యంతో బాధపడుతున్నారని ఇలా రకరకాలుగా తమకు ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని బీఆర్ఎస్ వర్గాలు, కేసీఆర్ సన్నిహిత వర్గాలు చాలా సందర్భాల్లో కొట్టిపారేశాయి. ఇంతకీ మరి కేసీఆర్ ఫాం హౌజ్ లో ఏం చేస్తున్నట్ల అందరిలో అనుమానం ఉంది.  

ఐతై ఫాం హౌజ్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తే చాలా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫాం హౌజ్ కు వెళ్లిన కేసీఆర్ దినచర్య చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట. తనకు ఎంతో మక్కువైన వ్యవసాయంపై ఎక్కువ సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారట. వీలు చిక్కినప్పుడల్లా వ్యవసాయం క్షేత్రం కలియతిరుగుతా అక్కడి పనివాళ్లకు సూచనలు చేస్తున్నారట. ఏ పంట వేస్తే బాగుంటుంది ..పంటకు ఎప్పుడు ఏ మందులు వాడాలి..మంచి దిగుబడి రావడానికి ఏం చేయాలో పని వారికి సూచనలు చేస్తూ సమయం గడిపేస్తున్నారట. 

అంతే కాదు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనతో బిజీబిజీగా గడిపినప్పుడు కొంత ఆలసట ఉండేవారట. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నారట. ఎన్నికల తర్వాత చాలా మంది కార్యకర్తలు ఓటమి తట్టుకోలేక కేసీఆర్ ను కలిసి కొంత బాధపడుతుంటే కేసీఆర్ స్వయాన వారిని ఓదార్చుతున్నారట. ఎందకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ప్రజలకు నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి..ఆ ప్రజలే నిర్ణయమే అంతిమమం అని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారట. అంతే కాదు కేసీఆర్ మాటలు ఆయన తీరున చూసిన నేతలు, కార్యకర్తలు షాక్ అవుతున్నారట. కేసీఆర్ గురించి బయట ఏదేదో జరుగుతుంది కానీ అసలు ఫాం హౌజ్లో కేసీఆర్ చాలా ప్రశాంతంగా ఉంటున్నారని నేతలు చెబుతున్నారు.

ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా  కేసీఆర్ వెబ్ సిరిసీలు కూడా చూస్తున్నారట. ఇటీవల పలు ఓటీటీలో వచ్చిన కొన్ని ఆసక్తికర పొలిటికల్ డ్రామాలను కేసీఆర్ తెగ చూస్తున్నారట. అంతే కాదు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఇటీవల రిలీజ్ అయ్యాయా...వాటి వివరాలు కూడా తీసుకుంటున్నారట. అంతే కాదు తనకు ఎంతగానో ఇష్టమైన పుస్తకాలను కేసీఆర్ చదువుతున్నారట. మధ్య మధ్యలో తెలంగాణలో సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ అప్డేట్స్ ను కూడా ఫాలో అవుతున్నారట. జనాలు ఏం అనుకుంటున్నారని సోషల్ మీడియా ద్వారా ఆరా తీస్తున్నారట.  గత 5 దశాబ్దాలుగా రాజకీయాలలో ప్రతి నిత్యం  కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. 

మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన 2001 నాటి నుంచి  మొన్నటి వరకు కేసీఆర్ చాలా బిజీగా బిజీగా మారారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాంటి కేసీఆర్ ఇటీవల కాస్తా ప్రశాంతంగా ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. దీనికి తోడు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయాన్ని కేసీఆర్ గడుపుతున్నారట. ఈ మధ్య కాలంలో కేసీఆర్ తమతో సంతోషంగా గడపడం పట్ల కుటుంబ సభ్యలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. గతంలో సీఎంగా ఉన్నప్పుడు తనను కలవాలనుకున్న సన్నిహితులకు స్వయాన కేసీఆర్ ఫోన్ చేసి ఫాం హౌజ్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారట. 

మరోవైపు కేసీఆర్ రాజకీయంగా ఏం చేయబోతున్నారని కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. గత కొద్ది నెలలుగా రాజకీయంగా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. సార్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తే బాగుంటుంది..కాంగ్రెస్ పాలనలో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు వచ్చి వారికి భరోసా ఇస్తే బాగుంటుందని నేతలు అడిగితే వారికి కేసీఆర్ నుంచి ఊహించని సమాధానం ఎదురైందంట. ఇప్పుడే ప్రజాక్షేత్రంలోకి వస్తే కాంగ్రెస్ కు సానుభూతి రావొచ్చు..కనీసం పది నెలల గడువు ఇవ్వక ముందే విమర్శలు చేస్తే బాగుండదు. ఐనా అతి త్వరలో జనాలు కేసీఆర్ నువ్వు మాకు అండగా నిలవాలని రోడ్డు మీదకు వస్తారు..అప్పుడు ఖచ్చితంగా జనాలకు తోడుగా వస్తాను అని కేసీఆర్ అన్నారట. అప్పటి వరకు పార్టీ ముఖ్య నేతలు ప్రజలకు అందుబాటులో ఉండండని చెప్పారట. అంతే కాదు పార్టీకీ అవసరమైన తగు సూచనలు చేస్తానని చెప్పారట.

మొత్తంగా బయట జరుగుతున్న ప్రచారాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ చాలా కూల్ గా ఉంటున్నారట. పాం హౌజ్ లో తనకు ఇష్టమైన పనులను చేస్తూనే మరోవైపు  తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలతో  కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారట. అతి త్వరలోను మళ్లీ సార్ బయటకు వస్తారు..కారును పరుగులు పెట్టిస్తారు అని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x