Chandra babu On Jagan:పెట్రో బాదుడులో జగనే టాప్.. పన్ను తగ్గించాలని చంద్రబాబు డిమాండ్

Chandra babu: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం బాటలోనే తమ పరిధిలోని పన్నును రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. కేంద్ర సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన వెంటనే.. కొన్ని రాష్ట్రాలు స్పందించాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 12:47 PM IST
  • పన్నుల భారంలో దేశంలోనే ఏపీ టాప్- బాబు
  • పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించాలని డిమాండ్
  • కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు
Chandra babu On Jagan:పెట్రో బాదుడులో జగనే టాప్.. పన్ను తగ్గించాలని చంద్రబాబు డిమాండ్

Chandra babu: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం బాటలోనే తమ పరిధిలోని పన్నును రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. కేంద్ర సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన వెంటనే.. కొన్ని రాష్ట్రాలు స్పందించాయి. రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయి. పెట్రోల్, డీజిల్ పై పన్ను ఎక్కువగా ఉన్న ఏపీ సర్కార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్ సర్కార్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. రాష్ట్రంలో భారంగా మారిన పెట్రోల్, డీజిల్ పై వెంటనే పన్ను తగ్గించాలని ఆయన ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

టీడీపీ పాలనలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఏపీ.. ఇప్పుడు పన్నుల భారంలో టాప్ లో ఉందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఆయా  రాష్ట్రాలను కూడా పన్నులు తగ్గించుకుని ప్రజలకు మేలు చేయమంటూ కేంద్రం పిలుపును ఇవ్వడాన్ని ఆయన ప్రశంసించారు. దేశంలోనే ఏపీలోనే ప్రస్తుతం పెట్రోల్ పై పన్ను ఎక్కువగా ఉందన్నారు. పన్ను తగ్గించాలని గతంలో ఎన్నిసార్లు విన్నవించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు చంద్రబాబు. గత సంవత్సరం అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని సొంత ట్యాక్సులు తగ్గించాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పైసా కూడా తగ్గించలేదని చంద్రబాబు మండిపడ్డారు. పన్ను తగ్గించకపోగా.. అదనంగా పన్నులు వేసూ ప్రజలపై భారం మోపారని విమర్శించారు.

పెట్రోల్ ధరల పెరుగుదలతో ప్రజలపై పెను ప్రభావం పడుతుందన్నారు చంద్రబాబు. నిత్యావసర వస్తువుల పెరగుదలకు పెట్రోల్, డీజిల్ ధరలే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 6 రూపాయలు పన్ను తగ్గించిందని చంద్రబాబు చెప్పారు. రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో పన్నులు తగ్గించాయన్నారు. ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం వెంటనే పన్ను తగ్గించుకుని ప్రజలకు ఊరట కల్గించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

READ ALSO: Election Survey: ప్రధానిగా మోడీ కంటే రాహులే బెటర్! బీజేపీకి షాకిచ్చిన సర్వే..

READ ALSO: Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News