Fenugreek Leaves Benefits: డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా ఈ ఆకును తింటే.. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.!

Fenugreek Leaves Benefits: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధి అందరని వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు  భారత్‌లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇండియాను డయాబెటిస్‌కు రాజధాని అని పిలుస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 09:20 AM IST
  • డయాబెటిస్ రోగులు మెంతి ఆకులును తినాలి
  • రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది
  • ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి
Fenugreek Leaves Benefits: డయాబెటిస్ రోగులు తప్పనిసరిగా ఈ ఆకును తింటే.. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.!

Fenugreek Leaves Benefits: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటిస్ వ్యాధి అందరని వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు  భారత్‌లో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇండియాను డయాబెటిస్‌కు రాజధాని అని పిలుస్తారు. మార్కెట్‌లో దీని నుంచి విముక్తి పొందడానికి అనేక రకాల ఔషదాలున్నాయి కానీ ఇవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో ఇలా వివరించారు.. డయాబెటిస్‌ను నియంత్రించడానికి పలు రకాల ఆహారాల నియమాలు పాటించాలని పేర్కొంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్‌ నియంత్రించేందుకు.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి:

మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాధికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఖచ్చితమైన చికిత్స లేదు. కావున ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మెంతి ఆకులు డయాబెటిస్‌కి ఎంతో మేలు చేస్తుంది:

మెంతి ఆకులు డయాబెటిస్‌పై ప్రభావ వంతగా పని చేస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఈ ఆకులో ప్రోటీన్, సహజ కొవ్వు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్-బి6, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, శక్తి, యాంటీఆక్సిడెంట్ ఉన్నాయి. అంతేకాకుండా సెలీనియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

డయాబెటిస్‌కి మెంతి ఆకుల ప్రయోజనాలు:

- మెంతికూర రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

- మెంతిఆకులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర శోషణ ప్రక్రియను నెమ్మదిస్తుంది.

-  మెంతికూరలో చాలా రకాల విటమిన్లు ఉంటాయి.

- మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది

- ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

- ఈ ఆకులు గుండె సమస్యలకు ఆయుర్వేద ఔషధంలా పని చేస్తుంది.

- పెరుగుతున్న బరువును వేగంగా తగ్గిస్తుంది.

(NOTE : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Betel Leaves: మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? తమలపాకులకు సంబంధించిన ఈ పరిహారాలు చేయండి

Also Read: Betel Leaves Fitness Tips: మీరెప్పుడైనా తమలపాకు నమిలి తిన్నారా? దీనిని తినడం ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News