Secunderabad Agnipath Violence: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ అరెస్ట్ !

Agnipath Scheme Violence Mastermind arrest: అగ్నిపథ్ పథకంపై ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు.

Written by - Pavan | Last Updated : Jun 21, 2022, 09:42 PM IST
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం కేసు దర్యాప్తులో వేగం పెంచిన హైదరాబాద్ పోలీసులు
  • హైదరాబాద్‌ పోలీసులు అదుపులో ఆవుల సుబ్బారావు
  • సికింద్రాబాద్ అల్లర్లకు ప్రధాన సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుబ్బారావు
Secunderabad Agnipath Violence: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో మాస్టర్ మైండ్ అరెస్ట్ !

Agnipath Scheme Violence Mastermind arrest: అగ్నిపథ్ పథకంపై ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమి కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్న ఆవుల సుబ్బారావు సికింద్రాబాద్ అల్లర్లకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారుల ముసుగులో కొంతమంది విధ్వంసం సృష్టించి, భయంకరమైన వాతావరణం ఏర్పడేందుకు కారణం కాగా.. ఈ విధ్వంసంలో పాల్గొన్న వారిలో సాయిడిఫెన్స్‌ అకాడమీ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సుబ్బారావుకు చెందిన 10 బ్రాంచ్‌ల నుంచి వచ్చిన విద్యార్థులు సికింద్రాబాద్ అల్లర్లలో పాల్గొన్నట్టు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టయింది. 

నరసరావుపేటలో సుబ్బారావును అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి అతడిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సుబ్బారావును న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచిన అనంతరం.. కోర్టు అనుమతితో రేపటి నుంచే సుబ్బారావును విచారించేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తమకు లభించిన అన్ని ఆధారాలను సేకరించి, క్రోడీకరించిన పోలీసులు.. వివిధ కోణాల్లో అతడిని (Avula Subba Rao) ప్రశ్నించి మరింత విలువైన సమాచారం రాబట్టే యోచనలో ఉన్నారు. ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇతర డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.

Also read : Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల స్పీడప్..వారి పాత్ర నిజమేనా ?

Also read : Secunderabad Violence: సికింద్రాబాద్ 'అగ్నిపథ్' విధ్వంసం.. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారానే అంతా జరిగింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News