Deepak Hooda becomes Fourth Indian Batter to hit Century in T20I format: మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ప్లేయర్ దీపక్ హుడా అద్భుతంగా ఆడాడు. తొలి టీ20లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన హుడా.. రెండో టీ20లో సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. హుడాకు అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలి సెంచరీ. ఆడిన ఐదో మ్యాచులోనే హుడా శతకం బాదడం విశేషం. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా దీపక్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో శతకం బాదడంతో దీపక్ హుడా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున టీ20ల్లో సెంచరీ బాదిన నాలుగో భారత ఆటగాడిగా దీపక్ నిలిచాడు. టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 4 సెంచరీలు బాది అగ్రస్థానంలో ఉన్నాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 సెంచరీలు బాధగా.. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. తాజాగా దీపక్ హుడా వీరి సరసన చేరాడు.
మ్యాచ్ అనంతరం దీపక్ హుడా మాట్లాడుతూ... 'నేను ఐపీఎల్ టోర్నీలో రాణించి భారత జట్టులోకి వచ్చాను. ఐపీఎల్ లాంటి ప్రదర్శననే ఇక్కడ కూడా అనుసరించాలనుకున్నా. పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు దూకుడుగా ఆడటం ఇష్టం. మ్యాచుకు అనుగుణంగా అవసరమైనంత మేరకు హిట్టింగ్ చేస్తా. ఈ మధ్య బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వస్తున్నా. క్రీజులో కుదురుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. సెంచరీ చేయడం హ్యాపీగా ఉంది' అని చెప్పాడు.
ఉత్కంఠభరిత ఈ మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆపై నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రెండు సిరీస్ 2-0తో భారత్ వశమైంది. సెంచరీతో చెలరేగిన దీపక్ హుడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
Also Read: JioPhone Next Price: స్మార్ట్ ఫోన్ డెడ్ చీప్ ధరకే.. నెలకు రూ.219 ఈఎంఐతో మీ సొంతం చేసుకోవచ్చు..
Also Read: భార్యాభర్తల మధ్య వయసులో అంత గ్యాప్ ఉండకూడదు, దాంపత్య జీవితం నాశనమవుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.