Fenugreek Seeds: ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గడమనేది కీలకంగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి కారణంగా స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే ఆ గింజలతో సులభంగా బరువు తగ్గించుకోవచ్చని ఎంతమందికి తెలుసు..
బరువు వేగంగా పెరుగుతుండటం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే ఎప్పటికప్పుడు బరువు తగ్గించుకోవడం చాలా అవసరం. అయితే బరువు తగ్గించుకునేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే ఆ గింజలతోనే సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఆ గింజలు మరేమీ కాదు. మెంతులు. మెంతులతో చాలా సులభంగా స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చు. స్థూలకాయం తగ్గించేందుకు మెంతుల్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
మెంతుల్ని మీ డైట్లో భాగంగా చేసుకోవాలి. దీనికోసం మెంతి టీ ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లలో మెంతి గింజలు, దాల్చిన చెక్క వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి టీ తాగినట్టు తాగాలి. ఇక మరో విధానం మెంతి గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి..ఉదయం వాటిని క్రష్ చేసి నీళ్లతో సహా నమిలి తినేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఇక మూడవ విధానం మెంతి గింజల్ని..తేనెతో కలిపి తీసుకోవడం. రెండు స్పూన్ల మెంతిగింజల్ని పౌడర్‌గా చేసుకోవాలి. ఇందులో తేనె కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఫిట్‌గా ఉంటారు.
Also read: Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఇలా చేయండి.. సులభంగా విముక్తి కలుగుతుంది..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook