Vikram Satires on media: ముఖాలు మార్ఫ్ చేసి ప్రచారం చేశారు.. వారిపై విక్రమ్ అసహనం!

Vikram Satires on media:  విక్రమ్ తాజాగా కోబ్రా సినిమా ఈవెంట్ కి వచ్చారు. ఈ సందర్భంగా తన గుండెపోటు మీద కథనాలు వెలువరించిన మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.

Last Updated : Jul 12, 2022, 08:17 PM IST
  • విక్రమ్ కు గుండెపోటు అంటూ ప్రచారం
  • కోబ్రా ఈవెంట్ కు హాజరైన విక్రమ్
  • గుండెపోటు వార్తలపై సెటైర్లు
Vikram Satires on media: ముఖాలు మార్ఫ్ చేసి ప్రచారం చేశారు.. వారిపై విక్రమ్ అసహనం!

Vikram Satires on media: నిజం బయటికి వెళ్ళే లోపు అబద్ధం అబద్దం ప్రపంచాన్ని చుట్టేసి తిరిగి వస్తుందని ఊరికే అనలేదు. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ విక్రమ్ హాస్పిటల్ కి వెళ్ళాడు అనగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని వార్తలు తమిళ మీడియాలో పుట్టుకొచ్చాయి. ఇక అక్కడ పుట్టుకొచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లోకి వెళ్లాయి అయితే సాయంత్రానికి అదేది నిజం కాదని ఆయన తీవ్ర జ్వర లక్షణాలతోనే అక్కడికి వెళ్లారని క్లారిటీ వచ్చింది.

ఇక ఆయన చికిత్స పొందుతున్న హాస్పిటల్ కూడా ఆయనకు గుండెపోటు లాంటిది ఏదీ లేదని గుండెల్లో కాస్త నలతగా అనిపించడంతో హాస్పిటల్ కి వచ్చారని బులిటెన్ విడుదల చేసింది. ఇదే విషయం మీద ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్  కూడా స్పందించి ఇది కరెక్ట్ కాదని ఖండించారు. ఇక తాజాగా కోలుకున్న విక్రమ్ కోబ్రా సినిమా ఈవెంట్ కి వచ్చారు. ఈ సందర్భంగా తన గుండెపోటు మీద కథనాలు వెలువరించిన మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారాలు చేసిన థంబ్ నైల్స్ పైన కూడా ఆయన సెటైర్లు వేశారు.

తాను హాస్పిటల్ కి వెళ్ళిన సమయంలో కొందరు తన ఆరోగ్యం గురించి ఈ తప్పుడు కథనాలు ప్రచారం చేశారని అనారోగ్యంతో బెడ్ పై ఉన్న వ్యక్తుల ఫోటోలకు నా ముఖం పెట్టి మార్ఫింగ్ చేసి వదిలారని అన్నారు. ఇవన్నీ నాకు అనుభవమే కానీ నా మిత్రులు అభిమానులు,  కుటుంబ సభ్యులు అండగా నిలబడడంతో నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పుకొచ్చారు. ఇక ఈవెంట్లో విక్రమ్ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉండడంతో ఆయన గుండెపోటు వార్తలని నిరాధారమైనవే అని తేలిపోయింది. ఆయన హీరోగా నటిస్తున్న కోబ్రా సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది.

ఈ సినిమాను అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించగా కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి విక్రమ్ సరసన నటించింది. ఇక ఈ సినిమాలో విక్రమ్ దాదాపు పదికి పైగా భిన్నమైన పాత్రలలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోపక్క దర్శకుడు మణిరత్నం తరికెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పొన్నియం సెల్వన్ సినిమాలో కూడా ఆదిత్య కరికాలన్  అనే పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ రోజునే విక్రమ్ కి అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది.
Also Read: Ram Pothineni: మా అమ్మకే అనుమానం తెప్పించారు మహానుభావులు.. అందుకే అలా మాట్లాడా!

Also Read: ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమే ఎంతో గొప్పది: నాగ‌ చైత‌న్య

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News