KTR-Rains: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
KTR-Rains: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో..ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ప్రజలువరదలు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.