Ravi Kishan: బన్నీ విలన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..ఎరక్క పోయి ఇరుక్కుపోయి

Actor Ravi Kishan getting trolled: అనూహ్యంగా రేసుగుర్రం విలన్ రవి కిషన్ ట్రోల్స్ బారిన పడ్డారు. దానికి కారణం ఆయన సంతానమే, అసలు ఏం జరిగిందంటే?

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 24, 2022, 12:13 PM IST
  • బీజేపీ ఎంపీగా నటుడు రవి కిషన్
  • ట్రోల్స్ బారిన పడ్డ రవి కిషన్
Ravi Kishan: బన్నీ విలన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు..ఎరక్క పోయి ఇరుక్కుపోయి

Actor Ravi Kishan getting trolled: భోజ్ పురిలో రవి కిషన్ ఒక స్టార్ నటుడు. కానీ తెలుగులో చేసిన రేసుగుర్రం సినిమా ద్వారా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు రవి కిషన్. ఆ సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్రతో మంచి నటుడిగా తెలుగులో స్థిరపడి అనేక సినిమాలు చేశారు. ప్రస్తుతం బీజేపీ నేత అయిన ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల రవికిషన్ జనాభా నియంత్రణ బిల్లుపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదేమంటే ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు కనకుండా ఉండేలాగా పార్లమెంట్లో ఒక ప్రైవేటు బిల్లు పెడతానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశ జనాభా భారీగా పెరిగిపోయే దిశగా వెళుతోందని ఇలా అయితే మనం ఎప్పటికీ విశ్వగురువులం కాలేము అంటూ ఆయన కామెంట్ చేశారు. దేశ అభివృద్ధికి జనాభా నియంత్రణ చాలా అవసరం అని చెబుతూ తాను పార్లమెంట్లో జనాభా నియంత్రణ బిల్లును ప్రైవేటుగా ప్రవేశపెడతామని తాను ప్రవేశపెట్టబోయే బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

అయితే రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు. రవి కిషన్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం రవి కిషన్ కు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు అంటే నలుగురు సంతానం ఉండడమే. నిజానికి నలుగురు పిల్లలున్న మీరు ఒక జంటకు ఇద్దరు పిల్లలు ఉండకూడదు అంటూ బిల్లులు ప్రవేశపెడతారా అంటూ ఆయనను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కుమారుడు పుట్టేంత వరకు పిల్లల్ని కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్రణ గురించి బిల్లు పెడతాననడం కామెడీగా ఉందంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు మరికొందరు ఏమో ఒకవేళ మీరు అలాంటి బిల్లు పెడితే మీ నలుగురు పిల్లలలో ఇద్దరు మాత్రమే మీకు దక్కుతారు అంటూ కూడా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Also Read: Producer Councell: షూటింగుల నిలిపివేత విషయంలో కీలక ప్రకటన!
Also Read: Sravana Bhargavi: ఎట్టకేలకు వెనక్కు తగ్గిన శ్రావణ భార్గవి.. డిలీట్ చేయనంటూనే డిలీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News