IND vs WI 1st T20I Weather Report: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ సమరానికి సిద్ధమైంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో నేడు భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న భారత స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. దాంతో భారత్ జట్టు ఫెవరెట్‌గా మారింది. వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడు.
తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కలిగించిన వరణుడు.. తొలి టీ20లో కూడా పలకరించనున్నాడు. మ్యాచ్ సమయానికల్లా ట్రినిడాడ్‌లో మేఘాలు మబ్బులతో కమ్ముకోనున్నాయి. 25 నుంచి 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచుకు ముందు లేదా జరిగే సమయంలో వాన దంచికొట్టనుందట. ఇదే జరిగితే మ్యాచ్ ఆలస్యంగా ఆరంభం కావచ్చు లేదా ఓవర్లు కుదించాల్సి రావచ్చు. అప్పుడు డక్‌వర్త్ లూయిస్ కీ రోల్ ప్లే చేయనుంది. అయితే ఒక్క ఓవర్ ఆట అయినా సాధ్యం కానుంది. దాంతో ఫలితం మాత్రం పక్కాగా రానుంది.
బ్రియాన్ లారా స్టేడియంలోని పిచ్ టీ20 ఫార్మాట్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్, మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కువగా జరిగాయి. అయితే పురుషుల అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించడం ఇదే మొదటిసారి. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ మైదానంలో ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా విజయాలు అందుకున్నాయి. దాంతో నేడు టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, ఇషాన్, దీపక్ హుడా, సూర్యకుమార్, పంత్, హార్దిక్, దినేశ్ కార్తీక్, జడేజా, హర్షల్, భువనేశ్వర్, కుల్దీప్.
వెస్టిండీస్: హోప్, మేయర్స్, బ్రూక్స్, కింగ్, పూరన్ (కెప్టెన్), పావెల్, కార్టీ, హోల్డర్, హోసెన్, మోతీ, జోసెఫ్.
Also Read: అదంతా కనబడుతుందని.. అనన్య పాండే కాళ్లపై విజయ్ దేవరకొండ చేతులేసి మరీ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook