Infinix Smart 6 Plus: ఇండియన్ మార్కెట్‌లోకి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.749కే..

Infinix Smart 6 Plus: ఇండియన్ మార్కెట్‌లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 3 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 2, 2022, 01:29 PM IST
  • ఇండియన్ మార్కెట్‌లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 3 నుంచి విక్రయాలు
  • ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ధర, ఫీచర్స్ ఇవే...
Infinix Smart 6 Plus: ఇండియన్ మార్కెట్‌లోకి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.749కే..

Infinix Smart 6 Plus Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్' పేరిట ఇండియన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల 3 నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ విక్రయాలు జరగనున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న లాంచింగ్ ఆఫర్  వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... 

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ధర ఇదే :

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ లాంచింగ్ ధర రూ.9999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో లాంచింగ్ ఆఫర్ కింద 20 శాతం తగ్గింపు అందిస్తున్నారు. తద్వారా రూ.7999కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంటే, రూ.2000 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే మరో 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందుతారు. అంటే, మరో రూ.399 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.7,7600కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.278 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా :

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే గరిష్ఠంగా రూ.7250 వరకు తగ్గింపు పొందుతారు. తద్వారా రూ.7999కి అందుబాటులో ఉన్న ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ఫోన్‌ని కేవలం రూ.749కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే స్మార్ట్ ఫోన్‌ కండిషన్‌ను బట్టే ధర లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ ఫీచర్స్ : 

6.82 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
8 మెగా పిక్సెల్ (డెప్త్ లెన్స్) + 5 మెగా పిక్సెల్ కెమెరా సెటప్
3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, ఎక్స్‌పాండెబుల్ అప్‌టు 512 జీబీ
మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
కలర్స్ : మిరాకిల్ బ్లాక్, ట్రాన్‌క్విల్ సీ బ్లూ

Also Read: MP SON ROBBED: టీఆర్ఎస్ ఎంపీ కొడుకు దారి దోపిడి.. హైదరాబాద్ లో ఇంత అరాచకమా!  

Also Read: CM KCR: ముందస్తుకే కేసీఆర్ మొగ్గు.. ఈనెలలోనే అసెంబ్లీ రద్దు? అంతా పీకే డైరెక్షన్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News