Komatireddy Venkat Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమయ్యింది. రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఉదయమే ఢిల్లీ వెళ్లారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి అమిత్‌షాను కలవనున్నారు. మరోవైపు.. ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా అమిత్‌షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. దీంతో, మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.
Komatireddy Venkat Reddy: అమిత్‌షాని కలవనున్న కోమటిరెడ్డి సోదరులు..!