National Flag Code: దేశం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి వాహనంపై కూడా జెండాలు ఎగురుతున్నాయి. అయితే వాహనాలపై జెండాలు ఎగురవేసేటప్పుడు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా తప్పకుండా ఫాలో కావల్సిందే..లేదా జరిమానా తప్పదు..
ప్రతి యేటా ఆగస్టు 15 దేశ స్వాతంత్ర దినోత్సవాన జాతీయ జెండాలు సర్వత్రా ఎగురుతూ కన్పిస్తుంటాయి. ముఖ్యంగా బైక్స్, కార్లపై తప్పకుండా దర్శనమిస్తుంటాయి. దేశభక్తి చాటే క్రమంలో మువ్వన్నెల జెండాకు కొన్ని నిబంధనలున్నాయని మర్చిపోకూడదు. జెండా ఎగురవేసేటప్పుడు ఆ నిబంధనల్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే నేషనల్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం శిక్ష తప్పదు. ఆ నేరం చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష భరించాల్సి వస్తుంది. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీరంతా తప్పకుండా కోడ్ నిబంధనలు, ఎందుకు శిక్ష పడుతుందో తెలుసుకోవాలి.
ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం కేవలం కొంతమంది రాజ్యంగబద్ధ పదవుల్లో ఉన్నవారికే వాహనాలపై జాతీయ జెండా ఎగురవేసే హక్కుంటుంది. అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, అసెంబ్లీ, కౌన్సిల్ స్పీకర్లు, ఛీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఛీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్స్, న్యాయమూర్తులు, విదేశాల్లో దేశ రాయబారులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
సాధారణ పౌరులు జాతీయ జెండాను తమ చేతుల్లో లేదా ఇంటి వద్ద ఎగురవేయవచ్చు. కానీ ప్రైవేటు వాహనాలపై జెండా ఎగురవేయడం చట్టరీత్యా నేరం. నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘించడం 1971 నేషనల్ హానర్ యాక్ట్, సెక్షన్ 3.23 కింద నేరమౌతుంది. జాతీయ జెండా వాహనాల పై భాగంలో, సైడ్స్, వెనుక భాగాల్లో ఎగురవేయకూడదు. సెక్షన్ 3.12 ప్రకారం జాతీయ జెండాను సరైన విధానంలో ఎగురవేయాలంటే..కారుపై జాతీయ జెండా ఎగురవేయాలంటే ఎవరో ఒకరు పట్టుకోవాలి, లేదా కారు ముందుభాగం బోనెట్ మధ్యన లేదా కుడి చేతివైపు మాత్రమే కచ్చితంగా ఫిక్స్ చేయాలి.
జాతీయ జెండాను దుర్వినియోగపర్చడం, కాల్చడం, చింపడం, అగౌరవపర్చడం, ధ్వంసం చేయడం వంటివి చేస్తే జైలు మూడేళ్ల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెంండూ పడవచ్చని చట్టం చెబుతోంది. జాతీయ జెండాను అగౌరవపర్చడం కూడా నేరమే.
Also read: PM Modi Speech: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.. ఐక్యమత్యమే మన ఆయుధమన్న ప్రధాని మోడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook