PM Modi Speech: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.. ఐక్యమత్యమే మన ఆయుధమన్న ప్రధాని మోడీ

Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు

Written by - Srisailam | Last Updated : Aug 15, 2022, 10:47 AM IST
  • ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ సందేశం
  • ప్రపంచ భారత్ వైపు చూస్తోంది- మోడీ
  • వచ్చే 25 ఏళ్లు భారత్ కు కీలకం- మోడీ
PM Modi Speech: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.. ఐక్యమత్యమే మన ఆయుధమన్న ప్రధాని మోడీ

Independence Day 2022: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఎర్రకోట నుంచి ఉద్వేగంగా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వీరులను కీర్తిస్తూనే.. గత 75 ఏళ్లలో భారత్ సాధించిన పురోగతిని వివరించారు. భారత్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ప్రపంచం భారత్ వైపు చూస్తుందన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చే 25 ఏళ్లు దేశానికి అత్యంత కీలకమన్నారు. పక్కా ప్రణాళికలతో సంపూర్ణ అభివృద్ది దిశగా ముందుకు సాగుదామన్నారు. ఐక్యమత్యమే మన ఆయుధమన్న మోడీ.. అందరి సమిష్టి కృషితోనే లక్ష్యాన్ని సాధించగలమని చెప్పారు. ఈ మార్పు కోసం ప్రతి ఒక్కరు శ్రమించాల్సి ఉందన్నారు మోడీ.

ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లిలాంటిదన్నారు ప్రధాని మోడీ. మదర్ ఆఫ్ డెమోక్రసిగా భారత్ కు గుర్తింపు వచ్చిందని చెప్పారు. మన వారసత్వాన్ని భావి తరాలకు అందించాలన్నారు. సమాజంలో వివక్షను తొలగిస్తామనే నమ్మకం ఉందన్నారు ప్రధాని మోడీ.సంపూర్ణ అభివృద్ధి మన లక్ష్యం కావాలని పిలుపిచ్చారు. ఎందరో త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం అన్నారు. దేశం కోసం పోరాడానికి వీరులకు ఆయన సెల్యూట్ చేశారు. ఒకప్పుడు భారత్ లో ఆకలి కేకలు వినిపించేవని.. 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రస్తుతం ఆహారధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ అభివృద్ధికి సహకరించిన వారందరిని స్మరించుకుందమన్నారు. బానిసత్వ విముక్తి కోసం పోరాడుదామని ప్రధాని సూచించారు.

త్యాగధనుల పోరాట ఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు ప్రధాని మోడీ. బానిస సంకెళ్ల విముక్తిలో వీరుల పోరాటం గొప్పదని కీర్తించారు. మహాత్మ  గాంధీ, నేతాజీ, బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు దేశానికి మార్గదర్శకులని చెప్పారు. ఎంతోమంది సమరయోధులు దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారన్నారు. ఆజాదీకా  అమృత మహోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు.వజ్రోత్సవాల వేళ దేశానికి కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలన్నారు.ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అభివృద్ధి చెందిన ప్రపంచదేశాల సరసన భారత్‌ను నిలబెడదామన్నారు.

స్వచ్ఛ భారత్‌, ఇంటింటికీ విద్యుత్‌ సాధన అంత తేలిక కాదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యువశక్తిలో దాగి ఉన్న శక్తిని వెలికితీయాల్సి ఉందన్నారు. మన మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగమని మోడీ ధీమా వ్యక్తం చేశారు.  పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనన్నారు. ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలన్నారు ప్రధాని.  దేశ ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Read Also: Srinivas Goud: మంత్రి గన్ ఫైర్ చేసినా డీజీపీ మౌనం? ఆ పోస్ట్ కోసమేనంటూ బీజేపీ ఫైర్..

Read Also: Munugode Byeelction: ఇంచార్జ్ MLAల సర్వే ప్రకారమే అభ్యర్థి ఎంపిక! మునుగోడుపై ప్లాన్ మార్చిన కేసీఆర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News