Sandalwood Health Benefits: చర్మ నిగారింపు కోసం కొన్ని వేల సంవత్సరాలుగా చందనంను ఉపయోగిస్తున్నారు. ఈ చందనాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఈ చందనం (Sandalwood) పట్టువేసుకుంటే చలువ చేసి.. తలనొప్పి తగ్గుతుందని నమ్ముతారు. ఈ చందనాన్ని శాంటాలేసి, శాంటాలమ్ జాతికి చెందిన మెుక్కల నుంచి వచ్చే కలప ద్వారా దీనిని తయారు చేస్తారు. ఈ మెుక్కలను మన తెలుగు రాష్ట్రాల్లో గంధపు చెట్లు అంటారు. చందనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం.
చందనం ఆరోగ్య ప్రయోజనాలు
>> చర్మానికి మెరుపు, మృదుత్వాన్ని అందించడంలో చందనం అద్బుతంగా పనచేస్తుంది.
>> చందనంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి మీకు ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా ఇవి అల్సర్ల చికిత్సలో కూడా ఉపయోగపడతాయి.
>> శాండల్‌వుడ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్స్, సెడేటివ్ మరియు సూథింగ్ ఎఫెక్ట్స్ వంటివి మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల నిద్ర రుగ్మతలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.
>> చందనంలో ఆల్ఫా-శాంటలోల్ అనే రసాయనం ఉందని... ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటంలో గంధపు చెక్క అద్భుతంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.
>> గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
>> మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయకారిగా ఉంటుంది.
>> చందనంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మెుటిమలను తొలగిస్తాయి.
>> సోరియాసిస్ రాకుండా ఇది అడ్డుకుంటుంది.
చందనం దుష్ప్రభావాలు
చందనం వల్ల దురద, మూత్రపిండాలు దెబ్బతినడం, మూత్రంలో రక్త రావడం వంటి సమస్యలు వస్తాయి. వెంటనే వైద్య సహాయం తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Also Read: Aloevera Health Benefits: అల్లోవెరా వెనిగర్ ఏయే చికిత్సల్లో ఉపయోగిస్తారు, కలిగే లాభాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook