Virat Kohli: టీ20ల్లో తొలి శతకం చేయడంత చాలా సంతోషంగా ఉందన్నాడు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. దాదాపు వెయ్యిరోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. ఈనేపథ్యంలో అతడిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. సీనియర్ క్రికెటర్లు, విశ్లేషకులు అభినందనలు తెలిపారు. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు టచ్‌లోకి రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పరుగుల వరద తప్పదంటున్నారు.
ఈక్రమంలో విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. ఈసందర్భంగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ వ్యక్తిగతం తనకెంతో ముఖ్యమని..కానీ నాకౌట్ దశలో బయటకు వచ్చామన్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా..తమ లక్ష్యమంతా ఆస్ట్రేలియా వేదికగా సాగే టీ20 వరల్డ్ కపేనని స్పష్టం చేశాడు. ఇందుకోసం జట్టు కూర్పును అద్భుతంగా తీర్చుదిద్దుకోవాలన్నాడు. ఓడిన మ్యాచ్‌ల నుంచి పాఠాలు నేర్చుకోవాలని తెలిపాడు.
ఆసియా కప్‌లో ఫ్రీగా ఆడానని..బ్యాటింగ్‌లో వైవిధ్యం కనిపించిందన్నాడు. బాగా ఆడితే..జట్టు విజయంలో అదే కీలకమవుతుందన్నాడు విరాట్ కోహ్లీ. చాలా రోజుల తర్వాత కోహ్లీ మొహంలో నవ్వు కనిపిస్తోంది. దాదాపు వెయ్యి రోజుల తర్వాత అతడి బ్యాట్ నుంచి సెంచరీ నమోదు అయ్యింది. ఈనెల 8న అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టారు. 122 పరుగులతో భారత తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.
సెంచరీ అనంతరం దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈసారి సరికొత్తగా నవ్వుతూ బ్యాట్‌తో అభివాదం చేశాడు. టీ20ల్లో సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నాడు కోహ్లీ. రాబోయే రెండు, మూడు నెలలు చాలా ముఖ్యమన్నాడు. రాబోయే రోజుల్లో ఉత్తమ జట్లతో మ్యాచ్‌లు ఆడబోతున్నామని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా వెళ్లేందుకు చాలా సమయం ఉందని..ఆ లోపే స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ఆడబోతున్నామన్నాడు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూను బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది.
What happens when @ImRo45 interviews @imVkohli ☺️ 👏
Laughs, mutual admiration & a lot of respect 😎- by @ameyatilak
Full interview 📽️https://t.co/8bVUaa0pUw #TeamIndia | #AsiaCup2022 | #INDvAFG pic.twitter.com/GkdPr9crLh
— BCCI (@BCCI) September 9, 2022
Some special words of praise for @imVkohli from @ImRo45 after that magnificent 💯 last night 👌👌
ICYMI, watch the full interview 🎥👇https://t.co/olA52aTSzg#TeamIndia #AsiaCup2022 pic.twitter.com/ts2d9ewQZE
— BCCI (@BCCI) September 9, 2022
Also read:Munugode: మునుగోడు ఉప ఎన్నికలో రెడ్డి వర్సెస్ బీసీ..పంతం ఎవరిదో..!
Also read:CM Jagan: ఆ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం వద్దు..అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Virat Kohli: తమ టార్గెట్ అంతా టీ20 వరల్డ్ కపే..భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..!
సంబరాల్లో విరాట్ కోహ్లీ
టీ20ల్లో తొలి శతకం
రోహిత్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు