Mahesh Babu Couple with Weavers: చేనేత మహిళలకు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ చేయుత

Mahesh Babu Couple Supports Weavers: సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఓ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారనే సంగతి తెలిసిందే.

Last Updated : Sep 15, 2022, 07:10 PM IST
Mahesh Babu Couple with Weavers: చేనేత మహిళలకు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ చేయుత

Mahesh Babu Couple Supports Weavers: సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఓ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని నారాయణపేట ప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చేనేత వస్త్రాల వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట ముందుకొచ్చింది. నారాయణపేటలోని చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఆరుణ్య నారాయణపేట పేరుతో ఆన్‌లైన్ వస్త్రాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. 

వీళ్ల వ్యాపారంలో చెప్పుకోదగిన ప్రత్యేకత ఏంటంటే.. మహిళలే తమ చేనేత వృత్తి నైపుణ్యాలకు పదునుపెడుతూ నేసిన వస్త్రాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా విక్రయించడం ద్వారా తమ కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు మహిళా సాధికారతకు పాటుపడుతున్నారు. 

మహిళల అభ్యుదయం కోసం మహిళలే కృషిచేస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు తాజాగా మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంటను కలిశారు. తమను కలిసిన చేనేత మహిళలను అభినందించిన మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట.. వారిని భుజం తట్టి ప్రోత్సహించడమే కాకుండా వారి కృషిని ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడుతూనే.. అదే సమయంలో చేనేత వృత్తిని మరో స్థాయికి తీసుకెళ్లడం గొప్ప విషయని మహేష్ బాబు జంట కితాబిచ్చారు.

mahesh babu and namratha shirodkar supports handloom weavers aarunya narayanapeta 

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు అందించిన ప్రోత్సాహం తమకు ఎంతో బూస్టింగ్ ఇచ్చిందంటున్నారు ఆరుణ్య నారాయణపేట సంస్థ ప్రతినిధులు. మహేష్ బాబు, నమ్రత జంట తమను రిసీవ్ చేసుకున్న తీరు పట్ల చేనేత మహిళలు హర్షం వ్యక్తంచేశారు. తాము మరింత ముందుకెళ్లడానికి వారి ప్రోత్సాహం ఎంతో బలాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. చేనేత మహిళలతో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట (Mahesh Babu next with Rajamouli) కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్టు తెలంగాణలో సినీ నటి సమంత కూడా చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : God Father First Single: చిరు-సల్మాన్ ల మాస్ పెప్పీ నంబర్.. మాములుగా లేదుగా!

Also Read : No Remake Heros: ఎన్ని డిజాస్టర్లు వచ్చినా ఒక్క రీమేక్ జోలికి కూడా పోని హీరోలు ఎవరో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News