God Father First Single: చిరు-సల్మాన్ ల మాస్ పెప్పీ నంబర్.. మాములుగా లేదుగా!

God Father First Single Thaar Maar Thakkar Maar Promo: గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 13, 2022, 06:26 PM IST
God Father First Single: చిరు-సల్మాన్ ల మాస్ పెప్పీ నంబర్.. మాములుగా లేదుగా!

God Father First Single Thaar Maar Thakkar Maar Promo: మెగాస్టార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ లూసిఫర్ సినిమాకు ఇది తెలుగు రీమేక్ గా రుపొందుతుంది. గతంలో అనేక మంది దర్శకులు చేతిలోకి వెళ్లి చివరిగా మోహన్ రాజ చేతిలో పడి రూపుదిద్దుకున్న ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్.

ఇక సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేస్తామని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రకటించిన సమయానికి విడుదల చేయలేక పోయింది. కాస్త ఆలస్యంగానే ఈ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ ఫస్ట్ సింగిల్ మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ మధ్య ఒక మాస్ నెంబర్ గా రిలీజ్ అయింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ నుంచి ఫస్ట్ సింగిల్ గా తార్ మార్ తక్కర్ మార్ అంటూ ప్రోమో రిలీజైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి అనుచరుడి పాత్రలో కనిపించబోతున్నారు.

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్, మోహన్ లాల్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు. ఇక వీరిద్దరి మధ్య ఒక మాస్ నెంబర్ని అంతే మాస్ గా రూపొందించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ఒక సంచలనం సృష్టించే అవకాశం ఉందని ప్రోమోతోనే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సునీల్, పూరి జగన్నాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మీద ఇప్పటి వరకు ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ ఈ మాస్ ప్రోమోతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచేసే ప్రయత్నం చేసింది. అయితే సినిమా నుంచి విడుదల చేస్తామని చెప్పిన ప్రోమో లేట్ చేయడంతో మెగా అభిమానులు, సినీ అభిమానులు కూడా సినిమా యూనిట్ ని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అయితే సినిమా నుంచి ప్రోమో విడుదలైన తర్వాత సూపర్ గా ఉందంటూ అదే రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ రావడంతోనే సినిమా నుంచి ప్రోమో విడుదల చేయడం ఆలస్యమైందని తెలుస్తోంది. ఏదైతేనేం మెగాస్టార్ అభిమానులు ఏదైతే కోరుకున్నారో అది వచ్చేయడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News