ED RAIDS: పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు రూ. 200 కోట్లు... హైదరాబాద్ నుంచే ట్రాన్స్ ఫర్? ఈడీ విచారణలో సంచలనం..

ED RAIDS:  ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్ లో ఈడీ జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారులు సోమవారం కరీంనగర్ జిల్లాకు చెందిన బల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ ను అదుపులోనికి తీసుకున్నారు.

Written by - Srisailam | Last Updated : Sep 20, 2022, 05:12 PM IST
  • ఈడీ సోదాల్లో సంచలనం
  • హైదరాబాద్ నుంచి ఆప్ కు రూ. 200 కోట్లు
  • మద్యం వ్యాపారులే తరలించారా?
 ED RAIDS: పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు రూ. 200 కోట్లు... హైదరాబాద్ నుంచే ట్రాన్స్ ఫర్? ఈడీ విచారణలో సంచలనం..

ED RAIDS:  ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్ లో ఈడీ జరుపుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్న ఈడీ అధికారులు సోమవారం కరీంనగర్ జిల్లాకు చెందిన బల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ ను అదుపులోనికి తీసుకున్నారు. అంతకుముందు బంజారాహిల్స్ లోని అతని నివాసంలో దాదాపు ఆరు గంటల పాటు సోదాలు చేశారు. ఈ సందర్భంగా కీలక సమాచారం దొరికిందని తెలుస్తోంది. అక్కడ లభించిన ఆధారాలతో వెన్నమనేనిని అదుపులోనికి తీసుకున్నారని తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో తొమ్మిది మంది హైదరాబాద్ మద్యం వ్యాపారులు ఉన్నారని తెలుస్తోంది. లిక్కర్ స్కాంలోనే వీళ్ల కీలక పాత్ర పోషించారని ఈడీ గుర్తించింది. తొమ్మిది మద్యం వ్యాపారులే టెండర్లకు దక్కించుకోవడానికి ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో పాటు అధికారంలో ఉన్న ఆప్ ప్రజా ప్రతినిధులకు ముడుపులు ఇచ్చారని తెలుస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రెండున్నర కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన మద్యం వ్యాపారి రామచంద్రన్ పిళ్లై కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. రామచంద్రన్ డీల్ చేస్తున్న స్టింగ్ ఆపరేషన్ వీడియోను కూడా ఢిల్లీ బీజేపీ ఎంపీ విడుదల చేశారు. ఆ ఎంపీనే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు లింకులు ఉన్నాయని ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ జరిగిన సోదాల్లో మరో సంచలన వెలుగు చూసిందని తెలుస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2 వందల కోట్ల రూపాయలను ఆప్ నేతలకు తెలంగాణ మద్యం వ్యాపారులు ఇచ్చారని ఈడీ గుర్తించిందని తెలుస్తోంది. ఈ నగదు తరలింపు వెన్నమనేని శ్రీనివాస్ డైరెక్షన్ లో సాగిందని చెబుతున్నారు. మనీ లాండరింగ్ ద్వారా శ్రీనివాస్ ఈ తతంగాన్ని జరిపారని అంటున్నారు. అయితే 2 వందల కోట్ల రూపాయలను లిక్కర టెండర్ల కోసమే ఇచ్చారా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో ఈడీ అధికారులు విచారణ సాగిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తెలంగాణ ముఖ్యమంత్రి భారీగా డబ్బులు పంపించారని కొంత కాలంగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈడి విచారణలో ఇందుకు సంబంధించి ఆధారాలను గుర్తించిందని సమాచారం.

Also Read: వేలంలో 'తగ్గేదేలే' అన్న కావ్య మారన్.. యువ ఆటగాడిని పోటీపడి మరీ దక్కించుకుందిగా!

Also Read: IT Transfers: హైదరాబాద్ ఐటీ శాఖలో ప్రక్షాళన.. వాళ్ల భరతం పట్టడానికేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News