Delhi Liquor Scam: ఢిల్లీలో వెన్నమనేని ఈడీ విచారణ.. లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్ ఎవరో..?

Delhi Liquor Scam:  దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో సోమవారం నుంచి ఢిల్లీలో విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల లింకులు తేలడంతో వాళ్లు ఎవరన్నది తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Sep 26, 2022, 10:25 AM IST
  • లిక్కర్ స్కాంలో ఢిల్లీలో ఈడీ విచారణ
  • వెన్నమనేనిని ప్రశ్నిస్తున్న అధికారులు
  • రాజకీయ నేతల లింకులపైనే ఆరా
Delhi Liquor Scam: ఢిల్లీలో వెన్నమనేని ఈడీ విచారణ.. లిక్కర్ స్కాంలో తొలి అరెస్ట్ ఎవరో..?

Delhi Liquor Scam:  దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రాజకీయ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తుండటంతో కేసులో ఏం జరగబోతుందన్న ఆసక్తి నెలకొంది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఇటీవల హైదరాబాద్ లో బిల్డర్ వెన్నమనేని శ్రీనివాస్ ను విచారించింది ఈడీ. అతని నివాసంలో సోదాలు అనంతరం ఈడీ కార్యాలయంలో అతన్ని ప్రశ్నించింది. తర్వాత వెన్నమనేనిని విచారణ కోసం ఢిల్లీకి పిలిచింది. సోమవారం నుంచి ఢిల్లీలో లిక్కర్ స్కాం విచారణ జరపనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో రాజకీయ ప్రముఖుల లింకులు తేలడంతో వాళ్లు ఎవరన్నది తేల్చే పనిలో ఈడీ ఉందని తెలుస్తోంది.

తెలంగాణకు సంబంధించి రాజకీయ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో నేరుగా సంబంధం లేకపోయినా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇతరత్రా వ్యాపార లింకులు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. దీంతో తమ బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారన్న కోణంలో విచారణ చేస్తున్నారని అంటున్నారు. బినామీలను ముందుపెట్టి అనధికారికంగా పెట్టుబడులు పెట్టి.. బ్లాక్ మనీనీ వైట్ చేసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు లభించిందని తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో కీలకంగా భావిస్తున్న వెన్నమనేని శ్రీనివాసరావు రాజకీయ ప్రముఖులకు బినామీ కావొచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారని సమాచారం. వెన్నమనేని నివాసంలో జరిగిన ఈడీ సోదాల్లో రెండు సాఫ్ట్ వేర్ సంస్థలు వెలుగులోనికి వచ్చాయి. ఆ సంస్థల్లో తనిఖీలు చేశారు. ఇందులో నేరుగా లిక్కర్ స్కాంతో లింకులు లేకపోయినా.. అనుమానాస్పద లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన అనుమానాస్పద లావాదేవీల గుట్టు రట్టు చేసే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. ఈ ఖాతాల వెనుక బినామీలు ఉన్నారని తేలితే... ఆ బినామీలెవరో తేల్చనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో  ఈడీ విచారణలో కవితకు సంబంధించిన లింకులు బయటికి వస్తాయా అన్న చర్చ సాగుతోంది. బినామీల మాటుల రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారని తేలితే.. సదరు నేతలపై ఐటీ నిబంధనల ప్రకారం బినామీ నిరోధక చట్టం ప్రయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది.అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరగవచ్చని భావిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ లో పలు సార్లు సోదాలు జరిపారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఆయన వ్యాపార భాగస్వామిలుగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌,  గండ్ర ప్రేమసాగర్‌ ఇళల్లోనూ సోదాలు నిర్వహించింది. తర్వాత  దోమల్‌గూడకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ సంస్థలో సోదాలు చేశారు. ఈడీ సోదాలు జరిగిన గోరంట్ల బుచ్చిబాబు ఎమ్మెల్సీ కవితకు సీఏగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. గోరంట్ల ఇంట్లోనే మద్యం కేసుకు సంబంధించి ఈడీకి అత్యంత కీలక సమాచారం లభించిందని తెలుస్తోంది. పదుల సంఖ్యలో సంస్థలు..  వందకు పైగా ఖాతాల వివరాలు ఈడీ చేతికి చిక్కినట్లు చెబుతున్నారు. వెన్నమనేని శ్రీనివాసరావు లింకులు కూడా గోరంట్ల ద్వారానే బయటికి వచ్చాయి. వెన్నమనేని ఢిల్లీ విచారణ తర్వాత కీలక నేతల అరెస్టులు ఉండవచ్చనే ప్రచారం సాగుతోంది.

Also read:  AP RAIN ALERT: ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్ తో సర్కార్ అలెర్ట్

Also read:  Jasprit Bumrah: పాకిస్తాన్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా.. అత్యంత చెత్త రికార్డుతో బూమ్రా షేమ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News